భూములు అంటేనే పంచాయితీ. అది ఒడవని ముచ్చట.. ఎన్నో లిటికేషన్లు.. అడ్డంకులు.. తరాల నుంచి వస్తూ మార్పిడి జరుగుతున్న భూముల విషయంలో జాగ్రత్తగా అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని కొనకుంటే అడ్డంగా బుక్కైపోతారు. అందుకే భూములు, ఇళ్లస్థలాల విషయంలో ఒకటికి రెండు సార్లుచెక్ చేసుకొని కొనాలని సలహా ఇస్తుంటారు. అలా చూసుకోకుండా పెట్టుబడి పెట్టిన మన సినీ ప్రముఖులు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు.
టాలీవుడ్ ప్రముఖ సినీ దిగ్గజాలైన రామానాయుడు ఫ్యామిలీ, రాఘవేంద్రరావులు ఒక భూమి విషయంలో బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. వారు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కొన్నారంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకెక్కింది. అయితే సింగిల్ బెంచ్ రామానాయుడు, రాఘవేంద్రరావులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినా విడవకుండా తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. ప్రభుత్వ భూమిని వాళ్ల పరం కాకుండా వాదిస్తోంది.
ఆ వివాదాస్పద భూముల కథేంటి?రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లో 26.16 ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యులు, దర్శకుడు కే.రాఘవేంద్రరావు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారని ప్రధాన ఆరోపణ. మల్లయ్య అనే వ్యక్తికి అసైన్ చేస్తే ఆ భూమి తీసుకోలేదని.. ఫలితంగా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని హైకోర్టులో ప్రభుత్వం వాదించింది. మాజీ సైనికులకు 5 ఎకరాలు చొప్పున ఇచ్చారని..
1963లో అప్పటి తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి నరసింహులు అనే వ్యక్తి బోగస్ డాక్యుమెంట్లతో భూమిని కాజేశారని ప్రభుత్వం ఆరోపణ. వాటిపై సంతకాలు.. అప్పటి తహసీల్దార్ సంతకాలకు అసలు పోలిక లేదని.. ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. వాటినే చేతులు మారుతూ ప్రస్తుతం దగ్గుబాటి, రాఘవేంద్రరావు కొన్నారని ప్రభుత్వం వాదిస్తోంది. అది ప్రభుత్వ భూమి అంటూ బల్లగుద్ది చెబుతోంది.
15 ఏళ్ల తర్వాత సేత్వారిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడు ఆ కొన్నభూములు ప్రభుత్వ భూములుగా మారాయి. వాటిని కొనుగోలు చేసిన దగ్గుబాటి, రాఘవేంద్రరావులకు చెందదని వాదిస్తోంది. భూమిపై హక్కులు లేని వాళ్ల నుంచి రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరులు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతోంది.
తెలంగాణ ప్రభుత్వ వాదనకు హైకోర్టు మొగ్గుచూపితే విలువైన ఆ భూమి చేజారి దగ్గుబాటి, రాఘవేంద్రరావు ఫ్యామిలీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.