మెడికిల్ షాపుల్లో టాబ్లెట్స్ కొంటున్నారా.. అయితే - ఇది మీ కోసమే?

Update: 2020-04-18 15:45 GMT
తెలంగాణ లో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం అంటూ వచ్చేవారికి ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందులు అమ్ముకూడదని వార్నింగ్‌ ఇచ్చింది.

ఆ మందులు వేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉండటంతో ..కరోనా పరీక్షలకు కొందరు ముందుకు రావడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. మెడికల్‌ షాపులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల వారు వాటిని అమ్మకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జీహెచ్‌ ఎంసితో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. దగ్గు, జలుబు, జ్వరం కరోనా లక్షణాలు కావడంతో అవి కనిపించిన వారు ప్రభుత్వం ఇచ్చే మందులను మాత్రమే వాడాలని వారికి రెగ్యులర్‌ గా వాడే మందులను విక్రయించి వద్దని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే ఆ టాబ్లెట్స్ కొనుగోలు చేసే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. వారి వివరాలను సేకరించి ప్రభుత్వం ఏం చేయబోతోంది..? వారికి టెస్ట్‌ లు చేసి క్వారంటైన్‌ కు తరలిస్తుందా, ఏం చేస్తుంది ? అనేదానిపై తెలంగాణ ప్రజానీకంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి కరోనా లక్షణాలన్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News