''ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారిని తెలంగాణ సర్కారు వివక్షతాపూరితంగా చూస్తోంది. ఈ దేశంలో అందరూ సమానులే. పిటిషనర్లకు 2013, 2015, 2018 పెన్షన్ బెనిటిఫిట్స్ వర్తింపజేయలేదు. హౌజింగ్ బోర్డు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం నుంచి అప్పు తీసుకోవాలి. లేదా బోర్డు ఆస్తులను తాకట్టు పెట్టి అయినా ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల వైఖరి కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది.'' అని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన 227 మందితోపాటు మరో ఐదుగురు గత సంవత్సరం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. రెండు నెలల్లోగా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని ఆదేశించింది. 2020 ఫిబ్రవరిలో ఈ తీర్పు వెలువరించింది. కానీ.. ఏడాది కాలం గడిచిపోయినా.. ఇప్పటి వరరకూ ఈ తీర్పు అమలు చేయలేదు. దీనిపై తాజాగా కోర్టుమళ్లీ విచారించింది.
ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ప్రాంతీయ వివక్ష చూపిస్తారా? అని నిలదీసింది. ఇప్పటికే దాదాపు19 మంది పిటిషనర్లు చనిపోయారని, ఇంకా పెన్షన్ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించిన ధర్మాసనం.. వచ్చే జన్మలో ఇస్తారా? అని ఘాటుగా ప్రశ్నించింది.
దీనికి ప్రఝభుత్వ తరపు న్యాయవాది ఆరు నెలల గడువు కోరగా.. కోర్టు మండి పడింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని చెప్పింది. ఆ తర్వాత మూడు నెలల సమయం అడిగినా ఇవ్వడం కుదరదని చెప్పింది. చివరకు నాలుగు వారాల గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ లోగా బాధితులకు పెన్షన్ అందకపోతే.. అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. జూలై 26వ తేదీకి కేసును వాయిదా వేసింది.