ఆ ఏడు దేశాల నుంచి వచ్చినోళ్లను వికారాబాద్ కు తీసుకెళతారు

Update: 2020-03-14 08:00 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ముకుతాడు వేసేందుకు వీలుగా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వికారాబాద్ లోని హరిత రిసార్టుకు తరలించాలని నిర్ణయించారు. కరోనా ప్రభావం వారిపై ఉందా? లేదా? అన్న విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని ఇళ్లకు పంపనున్నారు.

కరోనా కు పుట్టినిల్లు చైనానే అయినా.. చాపకింద నీరులా పలు దేశాల్లోకి విస్తరించటమే కాదు.. కొన్ని దేశాల్లో దీని తీవ్రంత అంతకంతకూ ఎక్కువ అవుతుంది. అలాంటి దేశాల జాబితా లో ఇటలీ.. ఇరాన్.. చైనా..దక్షిణ కొరియా.. ఫ్రాన్స్.. జర్మనీ.. స్పెయిన్ దేశాల నుంచి వచ్చే విమానప్రయాణికుల్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హరిత రిసార్టుకు పంపుతారు.

ఇప్పటికే అక్కడ ప్రత్యేక వార్డులు గా మారుస్తున్నారు. ఇందుకు అవసరమైన వైద్యులు.. వైద్య సిబ్బంది.. నర్సులు.. ఇతర సిబ్బందిని.. ఔషధాలు.. పరికరాల్నియుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఫీవర్.. గాంధీ.. ఛాతీ ఆసుపత్రికి తరలిస్తారు. ఒకవేళ లేనిపక్షంలో వారిని వికారాబాద్ లోనే ఉంచేస్తారు. ఇలా పద్నాలుగు రోజులు ఉంచిన తర్వాత.. వారు ఆరోగ్యంగా ఉంటే వారిని బయట ప్రపంచంలోకి అనుమతిస్తారు.
Tags:    

Similar News