భారీగా సంక్షేమ కార్యక్రమాలు.. చేతికి ఎముక లేనట్లుగా ప్రకటించే వరాలు అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద భారం పడుతోంది. దీన్ని మోసేందుకు వీలుగా అప్పుల మీద అప్పులు తెస్తున్న తీరు షాకింగ్ గా మారిందని చెప్పాలి. కరోనా కారణంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోగా.. ఖర్చులకు అవసరమైన నిధుల కోసం భారీగా అప్పులు చేయాల్సిన దుస్థితి. ఎంతలా అంటే.. ఈ ఏడాది చేసిన అప్పుల లెక్క విన్నంతనే వణుకు పుట్టేలా ఉండటం గమనార్హం.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.32వేల కోట్ల మేర అప్పులు తెచ్చినట్లుగా చెబుతున్నారు. గడిచిన రెండు నెలల్లో (నవంబరు, డిసెంబరు) బాండ్ల వేలం ద్వారా రూ.10,572 కోట్ల మొత్తాన్ని సమీకరించారు. ఒక్క డిసెంబరులోనే రూ.7వేల కోట్ల మేర అప్పులు చేయాల్సిన దుస్థితి. గత ఏడాది (ఆర్థిక సంవత్సరంలో) తెచ్చిన అప్పులు రూ.30వేల కోట్లు కాగా.. ఈ ఏడాది డిసెంబరునాటికే రూ.32వేల కోట్లు అప్పులు తేవటం గమనార్హం. చూస్తుంటే.. రానున్న మూడు నెలల కాలంలో మరిన్ని అప్పులు తేవాల్సిన పరిస్థితి. కొత్త అప్పుల్ని కలిపితే.. రూ.40వేల కోట్లకు పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు తెచ్చినట్లు అవుతుంది.
సాధారణంగా ఒక నెలలో రూ.3నుంచి రూ.4వేల కోట్ల వరకు అప్పులు తెస్తుంటే.. అందుకు భిన్నంగా సాధారణ అప్పుకు మించి ఒక్క డిసెంబరులో రూ.7వేల కోట్లకు పైగా అప్పులు తేవటానికి కారణం.. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు కార్యక్రమమే. ఈ పథకంలో భాగంగా డిసెంబరు.. జనవరి మొదటి వారంలో దాదాపు రూ.7వేల కోట్లకు పైనే నిధులు అవసరమవుతాయి. దీని కోసం భారీగా అప్పులు చేస్తున్న దుస్థితి.
కరోనా కారణంగా లాక్ డౌన్ వేళలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయినా.. తర్వాత మాత్రం పుంజుకుంది. అయితే.. రిజిస్ట్రేషన్లను మూడు నెలలకు పైనే నిలిపివేయటం కారణంగా భారీ ఆదాయాన్ని ప్రత్యక్షంగా నష్టపోవటమే కాదు.. ఆస్తులు రిజిస్ట్రేషన్ల కారణంగా జరిగే టర్నోవర్ మీద వచ్చే పన్ను ఆదాయాన్ని కేసీఆర్ సర్కారు మిస్ అయినట్లుగా చెప్పక తప్పదు. ఏమైనా అప్పులతో రాష్ట్ర పాలనా రథాన్నిలాగటం మాత్రం భవిష్యత్తుకు ఇబ్బందేనని చెప్పక తప్పదు.