అందరు చెక్ చేసుకోండి..ఒక్కో ఫ్యామిలీకి రూ.1500 జమ!

Update: 2020-04-14 08:37 GMT
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న సమయంలోరాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డుదారులకు ఒక్కో కార్డుపై రూ.1500 చొప్పున నగదు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నుండి ప్రజలని కాపాడటానికి పక్కా వ్యూహాలని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12 కేజీల బియ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా వారి వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 1500 జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

మంగళవారం ఈ డబ్బు అర్హుల అకౌంట్లలో జమకానున్నాయి.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తెలంగాణవ్యాప్తంగా 74లక్షలకుపైగా అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని మంత్రి తెలిపారు. మొత్తం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసినట్లు చెప్పారు. అయితే మంగళవారం అంబేద్కర్‌ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు.. బుధవారం నుంచి చెల్లింపులు చేయనున్నారు. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్లకు ఏటీఎం కార్డులు ఉన్నవారు మాత్రం మెసేజ్‌ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు.

మరోవైపు కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తోంది. 2020 - ఏప్రిల్ 13వ తేదీ సోమవారం సాయంత్రం వరకు 61 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరుకున్నట్లైంది. హైదరాబాద్ లో 267 కేసులు నిర్ధారించారు. మృతుల సంఖ్య 17కు చేరుకుంది. 
Tags:    

Similar News