రాజ్ ​భవన్ ​లో పేదలకు భోజనం.. గవర్నర్​ తమిళసై వినూత్న కార్యక్రమం

Update: 2021-02-09 04:40 GMT
తెలంగాణ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టినప్పటి తమిళ సై సౌందర్​రాజన్​ తన మార్కును చూపిస్తున్నారు. కరోనా టైంలో ఏకంగా ఆమె ఉన్నతాధికారులతో సమావేశమై సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. అయితే తమిళ సై గవర్నర్​గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ‘రాజ్‌భవన్ అన్నం’ పేరిట ఓ కొత్త కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.  రాజ్​భవన్​లో పనిచేసే కార్మికులు, తోటపనివాళ్లు, అలాగే రాజ్​భవన్​ స్కూల్​లో చదివే పేద ప్రజల కోసం ఆమె ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.

‘రాజ్​భవన్ అన్నం’ పేరిట వాళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకాన్ని సోమవారం గవర్నర్​ తమిళసై సౌందర రాజన్​ ప్రారంభించారు.    ప్రతిరోజు పేదలకు రెండు పూటలా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతో గవర్నర్​ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాజ్​ భవన్ వర్గాలు అంటున్నాయి. సోమాజిగూడలో రాజ్​భవన్​ ఉన్న విషయం తెలిసిందే.

ప్రతిరోజు దాదాపు 500 మందికి  ఇక్కడ భోజనం పెట్టబోతున్నారు.  ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఈ కార్యక్రమం పేదలకు మేలు చేకూరుస్తుందని రాజ్​భవన్​ అధికారులు అంటున్నారు.రాజ్​భవన్​లోని వంటలు చేస్తారు కాబట్టి.. భోజనం, కూరల విషయంలో కచ్చితంగా నాణ్యత  ఉంటుందని వాళ్లు అంటున్నారు.
Tags:    

Similar News