వాళ్ల‌కు టీ స‌ర్కారు ఆ మాట చెప్పిందా?

Update: 2015-07-17 08:58 GMT
ఓటుకు నోటు వ్య‌వ‌హారం గురించి ప్ర‌త్యేకం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌ప‌క్క ఓటుకు నోటు వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ స‌ర్కారు త‌మకు చెందిన ప్ర‌ముఖ‌ల ఫోన్లు ట్యాపింగ్‌కు గురి అయిన‌ట్లుగా పేర్కొన‌టం తెలిసిందే.
దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసి.. టెలికం ప్రొవైడ‌ర్ల‌కు ఏపీ స‌ర్కారు నోటీసులు ఇవ్వ‌టం.. విచార‌ణ‌కు పిలిపించ‌టం లాంటివి చోటు చేసుకోవ‌టం తెలిసిందే.ఈ సంద‌ర్భంగా కాల్ డేటా వివ‌రాల్ని ఏపీ అధికారులు కోర‌టం తెలిసిందే. తాజాగా ఈ ఉదంతానికి సంబంధించి కోర్టులో వాద‌న‌లు మొద‌ల‌య్యాయి.

ట్యాపింగ్ కేసుల‌కు సంబంధించి టెలికం స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టులో హాజ‌రై త‌మ వాద‌న‌లు వినిపించారు. ఏపీ అధికారులు కోరిన కాల్ డేటాను ఇవ్వొద్ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరింద‌ని.. ఒక‌వేళ కాల్ డేటా కానీ ఇస్తే వారిని ప్రాసిక్యూట్ చేస్తామ‌ని హెచ్చ‌రించింద‌ని ఈ కార‌ణంతోనే తాము కాల్ డేటా ఇవ్వ‌లేద‌ని చెప్పిన వారు.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఏపీకి కాల్ డేటా ఇవ్వొద్ద‌ని తెలంగాణ స‌ర్కారుతో పాటు.. కేంద్రం కూడా చెప్పింద‌ని వెల్ల‌డించారు.

టెలికం స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల‌నుతెలంగాణ ప్ర‌భుత్వం ఇవ్వొద్ద‌ని ఆదేశిస్తే.. ఏపీ స‌ర్కారు ఇవ్వ‌మ‌ని కోరితే ఎందుకు ఇవ్వ‌నట్లు..? స‌మాచారం ఇవ్వ‌క‌పోతే కేసులు బుక్ చేస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెప్పింద‌ని చెబుతున్న ప్రొవైడ‌ర్లు.. అదే విధంగా కాల్ డేటా వివ‌రాల్ని ఏపీ అధికారులు అడిగితే ఎందుకు ఇవ్వ‌న‌ట్లు?

అంటే.. ఏపీ స‌ర్కారు కేసులు పెడితే కోర్టుకు వ‌చ్చే స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు.. కాల్ డేటా ఇవ్వ‌టానికి మాత్రం ఎందుకంత గ‌ట్టిగా ఉన్నారు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. మ‌రోవైపు.. స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు చెప్పిన మాట‌ల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. కాల్ డేటా తెలంగాణ స‌ర్కారు ఎందుకు ఇవ్వొద్ద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News