'మిషన్ కాకతీయ' ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణకు పూనుకొంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వ్యవహారం గురించి తెలంగాణ ప్రభుత్వం ఒక రేంజ్‌లో ప్రచారం చేసుకొంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. కాకతీయుల కాలం నాటి చెరువులకు మరమ్మతులు చేయిస్తామని.. వీటి ద్వారా పల్లెటూళ్లకు కొత్త శోభను తీసుకొస్తామని.. కరువును పారదోలుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
ఆ మాటల సంగతెలా ఉన్నా.. ఈ పథకంలో గులాబీ చొక్కాలకు అదృష్టం కలిసి వస్తోందని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో సొమ్ములు ఖర్చు పెడుతోంది. చెరువుల్లో పూడిక తీత పనుల కోసం కోట్ల రూపాయలను వెచ్చించనుంది.
కాంట్రాక్టర్ల ద్వారా ఈ పనులు చేయించనుండటంతో.. ఆ కాంట్రాక్టులు గులాబీ పార్టీ సన్నిహితులకే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది! ఈ పార్టీ తరపున ఉన్న ఎమ్మెల్యేలు, వారి వెనుక ఉన్న కాంట్రాక్టు సంస్థలు పూడిక తీత పనులను చేజిక్కించుకొంటున్నారు. మరో ఆలోచన లేకుండా అధికార పార్టీ అనుంగులకే ఈ అవకాశాలు దక్కుతున్నాయని తెలుస్తోంది.
మరి ఇలా ప్రభుత్వ పథకంలోకి అధికార పార్టీ వారు ఎంటరయ్యారంటే.. ఆ తర్వాత ఏం జరుగుతుంతో వేరే చెప్పనక్కర్లేదు. వెనుకటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి!
గతంలో పనికి ఆహారం పథకం అంటూ.. తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్ద స్కామే జరిగింది. అప్పట్లో గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బియ్యంతో పండగ చేసుకొన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి వంటి వారు కూడా 'బియ్యం రెడ్డి' అంటూ విమర్శలను ఎదుర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మిషన్‌కాకతీయ కూడా అదే తీరును అగుపిస్తోంది.
ఇది కమిషన్‌కాకతీయగా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇంకా పనులు సరిగా ప్రారంభం కాలేదు.. అప్పుడే విమర్శలు మొదలవుతున్నాయంటే.. పనులు మొదలు పెట్టాకా.. అసలైన అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సకాలంలో ఈ పనులు పూర్తికాకపోతే మళ్లీవర్షాలు వస్తాయి. అప్పుడు చెరువుల్లో పూడిక తీత సాధ్యం కాదు. అలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుదే!
ఈ పరిణామాలను బట్టి చూస్తే.. మిషన్‌కాకతీయ తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్‌ను ఎక్కడికి తీసుకెళుతుందో అనే సందేహాలు కలుగుతున్నాయి.