తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అధికార - ప్రతిపక్షాల వ్యూహాలు రాటుదేలుతున్నాయి. ఈ దఫా తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ఏకమై సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. అదేసమయంలో ముఖ్యంగా రైతు ఆత్మహత్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. అయితే విపక్షాలుపక్కా స్కెచ్ తో సిద్ధమవుతుంటే... ధీటుగా సమాధానం చెప్పే స్క్రిప్ట్ ను ఆధికారపక్షం ప్రిపేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే టీఆరెస్ ఎల్పీ సమావేశం ఏర్పాటుచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరెవరు ఏఏ అంశాల మీద మాట్లాడాలన్న దానిపై దిశానిర్ధేశం చేశారు.
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల డిజైన్ మార్పుపై ప్రతిపక్షాలు ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తున్నందువల్ల కౌంటర్ వేయటానికి అధికార పార్టీ సిద్దమవుతోంది. అటు ప్రతిపక్షాలు సంధించే సమస్యల చిట్టాపై ఎమ్మెల్యేలు - మంత్రుల్లో అవగాహన పెంచాలని సీఎం కేసీఆర్ భావించారు.టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా చర్చ ముందుకు సాగింది. ఆయా అంశాల్లో ఉన్న అవగాహన ఆధారంగా సీఎం బాధ్యతలు అప్పగించారు.
రైతుల ఆత్మహత్యలను తిప్పికొట్టేందుకు...కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో పరిస్ధితిపై కేసీఆర్ ఇప్పటికే నివేదికలు తెప్పించారు. దీని ఆధారంగా అసెంబ్లీలో దూకుడుగా వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 30 నాటికి కరవుపై నివేదికలు పంపాలని కేంద్రం కోరనున్నట్లు ప్రభుత్వం వద్దసమాచారం ఉంది. ఈ సమయంలోనే ఓ కమిటీ త్వరలో ఢిల్లీకి వెళ్లి పరిస్థితిని వివరించబోతోంది. కరవు అంశం వచ్చినప్పుడు ఇదే విషయాన్ని సమాధానంగా చెప్పబోతోంది టీఆర్ ఎస్.
మొత్తం మీద ప్రతిపక్షాలకన్నా ముందే ప్రభుత్వం అన్ని అంశాల మీదా చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు దూకుడు మీద ఉంటే…అంతకంటే దూకుడుతో కేసీఆర్ ముందుకు వెళుతూ వేడిని పెంచుతున్నారు.