ప్రకటనల్లో కనిపించే ఆర్భాటానికి.. అవి కాస్తా అమలు కావటానికి మధ్య అంతరం ఎంత అన్నది తాజా ఉదంతం చూస్తే అర్థమవుతుంది. ఆ మధ్య స్థానిక సంస్థల నేతలకు జీతాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
అయితే.. దీని అమలు ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లుగా తాజాగా ప్రకటించారు. భారీగా పెరిగిన స్థానిక నేతల జీతభత్యాలపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తే.. మరికొన్ని వర్గాలు మాత్రం తీవ్ర మండిపాటును వ్యక్తం చేశాయి. కొందరి జీతాల విషయంలో ఉదారంగా వ్యవహరించిన ప్రభుత్వం మరికొందరి విషయంలో మాత్రం పట్టించుకోలేదన్న వాదన ఉంది.
జెడ్పీటీసీ సభ్యుడికి గౌరవ వేతనం కింద నెలకు రూ.2250 వస్తుందే.. కొత్త నిబంధన ప్రకారం అది రూ.10వేలుగా మారింది. అదే సమయంలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌కు నెలకు గౌరవ వేతనం రూ.7500 అయితే.. తాజాగా దాన్ని లక్ష రూపాయిలుగా పెంచారు. పెంపులో హేతుబద్ధత లేదన్న వాదన.
అదే సమయలో ఎంపీటీసి సభ్యుడి గౌరవ వేతనం రూ.1000 నుంచి 1500 వరకు ఉంటే కొత్తగా దాన్ని రూ.5వేలకు పెంచారు. అదే సమయంలో ఎంపీటీసీ సభ్యుడి ఇప్పటివరకూ అందిస్తున్న గౌరవ వేతనం నెలకు రూ.750 ఉంటే దాన్ని రూ.5వేలకు పెంచారు. రూ.750 నుంచి రూ.5వేలకు ఎంపీటీసీకి ఇస్తున్నప్పుడు.. రూ.1000 నుంచి రూ.1500 వరకున్న సర్పంచ్ గౌరవ వేతనాన్ని రూ.5వేలకే పరిమితం చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సర్పంచ్‌లు పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలాంటి మార్పులు చేయలేదు. గౌరవ వేతనాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నారు.