తమది సంపన్న రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎంత సంపన్న రాష్ట్రమైనా.. కాలం ఖర్మం కలిసి రాకపోతే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులన్నది తాజాగా ఆయనకు అర్థమయ్యే పరిస్థితి.
తెలంగాణ బెవరేజస్‌కు చెందిన దాదాపు రూ.1270కోట్లను ఆ మధ్య ఐటీ శాఖ బకాయిల కోసం ఆర్‌బీఐ నుంచి ఏకమొత్తంగా తరలించివేయటం తెలిసిందే. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు పెద్దగా స్పందించని తెలంగాణ సర్కారుకు..ఐటీ శాఖ ఇచ్చి షాక్‌తో ఒక్కసారి ఉలిక్కిపడింది. ఐటీ శాఖ అంత భారీ మొత్తాన్ని ఏకమొత్తంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించటంతో పాటు.. దీని సంగతి తేల్చటానికి అన్నట్లుగా ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలవటం.. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లటం చేశారు.
అయితే.. ఈ విషయాన్ని రెండు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన జైట్లీ మాటలకు.. చేతలకు ఏ మాత్రం సంబంధం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. రోజులు గడుస్తున్నా.. ఇంతవరకూ ఐటీ శాఖ బక్కసంలోకి వెళ్లిన రూ.1270కోట్లు తెలంగాణ సర్కారుకు చేరని పరిస్థితి.
అదే జరిగితే.. ఈ నెలాఖరులో జీతాలు ఇచ్చే విషయంలో తెలంగాణ సర్కారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని.. కాస్త తేడా వస్తే.. జీతాలు ఇచ్చే విషయం కూడా కష్టమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారీ మొత్తం తరలివెళ్లటంతో ఒక్కసారిగా నిధుల కొరత భారీగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని బెవరేజస్ ఆదాయానికి సంబంధించి ఐటీ బకాయిల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను చెల్లించాలని ఐటీ శాఖ కోరటం.. అందుకు తగిన విధంగా తెలంగాణ సర్కారు స్పందించకపోవటంతో.. అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని ఐటీ శాఖ అర్‌బీఐ అనుమతితో తరలించి వేసింది. ఊహించని ఈ పరిణామంతో తెలంగాణ సర్కారు ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.