తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పంటగా చెప్పే కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలుగుతున్నాయి. మొన్నటివరకు ఉన్న కోర్టు స్టే ఇప్పుడు ఎత్తేయటమే కాదు.. కూల్చివేతకు ఓకే చెప్పేసింది. ఇప్పటికే కూల్చివేత కార్యక్రమం కొద్ది రోజుల పాటు జోరుగా సాగి.. కోర్టు ఆదేశాలతో ఆగిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దాదాపు పాతిక ఎకరాల్లో పదకొండు బ్లాకులుగా ఉన్న ఇప్పటి సచివాలయం దగ్గర దగ్గర 9.87లక్షల చదరపు అడుగుల్లో నిర్మించి ఉంది. మరి.. ఈ భారీ భవంతుల్ని పూర్తిగా నేలమట్టం చేయనున్న నేపథ్యంలో.. పెద్ద ఎత్తున నిర్మాణ వ్యర్థాలు రానున్నాయి. మరి.. వీటి లెక్కలు చూస్తే.. సారు కల ఎంత భారీ అన్నది ఇట్టే అర్థమైపోతుంది.
మొత్తం కూల్చివేత సందర్భంగా నిర్మాణ వ్యర్థాల్లోకేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే మళ్లీ ఉపయోగించుకునే వీలుందని చెబుతున్నారు. సచివాలయం కూల్చివేత సందర్భంగా దగ్గర దగ్గర 99,670 టన్నుల వ్యర్థాలు నిర్వాహణకు రానున్నాయి. వీటిని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జీడిమెట్లలోని నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంటుకు అప్పగించనున్నారు. ఈ ప్లాంటు రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల్ని శుద్ధి చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు.
ఈ లెక్కన మొత్తం వ్యవర్థాల్ని శుద్ధి చేసేందుకు దగ్గర దగ్గర 199రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సచివాలయం నుంచి జీడిమెట్లలోని వ్యర్థాల నిర్వహణ ప్లాంటుకు మధ్య దూరం 16.5 కిలోమీటర్లు. ఇంత స్క్రాప్ తీసుకెళ్లే క్రమంలో దుమ్ము.. ధూళి పడే వీలుంది. అలాజరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నా.. వాస్తవంలో అది సాధ్యం కాదనే చెప్పాలి. ఇప్పుడున్న ట్రాఫిక్ కు అదనంగా వ్యర్థాల్ని తరలించేందుకు భారీగా వాహనాలు అవసరం కానున్నాయి. వచ్చే వ్యర్థాల లెక్క చూస్తే.. సింహభాగం కాంక్రీట్ 72,620 టన్నులు వస్తుందని.. స్టీల్ 2వేల టన్నులు.. మట్టి రాళ్లు 5వేల టన్నులు ఫర్నీచర్ 500 టన్నులు.. విద్యుత్తు సామాగ్రి 100 టన్నులు.. కలప వంద టన్నులు.. ఇతరాలు 1350 టన్నుల మేర వ్యవర్థాలు జనరేట్ కానున్నట్లు చెబుతున్నారు.