అలంద మీడియా సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలలుగా జర్నలిస్టు - మీడియా వ్యాపారి రవి ప్రకాష్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మూడు కేసుల్లో రవిప్రకాశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వరుస వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతులు రవి ప్రకాష్ కు మింగుడు పడకపోయినా బెయిల్ రావడం అన్నది అతనికి పెద్ద ఊరటే.
ఫోర్జరీ - నిధుల మళ్లింపుతో పాటు మొత్తం మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ కు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కోర్టు మూడు షరతులు పెట్టింది. పోలీసుల విచారణకు సహకరించాలని - వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని - కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్ ను ఆదేశించింది.
గతంలో రవిప్రకాశ్ బెయిల్ కోసం రెండు సార్లు హైకోర్టును - ఒకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పోలీసుల ముందు హాజరై ఆ తర్వాత హైకోర్టులో దరఖాస్తు చేసుకోమని చెప్పడంతో అన్ని డోర్లు మూసుకుపోయిన నేపథ్యంలో రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం రవిప్రకాష్ బెయిల్ కోసం మళ్లీ తెలంగాన హై కోర్టుకు దరఖాస్తు చేసుకోగా... పలుమార్లు దీనిపై విచారణ కొనసాగింది. ఈరోజు బెయిలు మంజూరయ్యింది.