ట్విట్టర్ పై తెలంగాణ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైన కామెంట్లను ప్రోత్సహిస్తున్న ట్విట్టర్ పై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయొద్దో చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. వైరస్ తో ముస్లింలకు ముడిపెడుతూ చేసిన ట్వీట్లను ఎందుకు తొలగించలేదని ఆగ్రహించింది. ట్విట్టర్ తో పాటు కేంద్రం, హోం శాఖ కార్యదర్శులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లాంతో కరోనాను ముడిపెడుతూ రెచ్చగొట్టే కామెంట్స్ ను ట్విట్టర్ ప్రోత్సహిస్తోందంటూ ఖాజా అయిజాజుద్దీన్ అనే అడ్వొకేట్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే కామెంట్స్ ను తొలగించేలా చూడాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇలాంటి ట్వీట్లు గత కొన్ని నెలలుగా ట్రెండ్ అవుతున్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
ట్విట్టర్ ద్వారా ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయంటూ అయిజాజుద్దీన్ ఆరోపించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ ప్రచారాన్ని వెంటనే ఆపేయాలన్నారు. అయిజాజుద్దీన్ పిటిషన్ పై విచారించిన చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన బెంచ్ తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్ తోపాటు కేంద్ర కేబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీలకు నోటిసు ఇచ్చింది హైకోర్టు. అలాగే ట్విట్టర్‌పై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయొద్దో నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని హైకోర్ట్ చెప్పింది.