దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్నిఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి దీపావళి పండుగలో టపాసులు పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది ఇంద్ర ప్రకాష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని, ఈ సమయంలో టపాసులు పేల్చడం వలన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని పిటిషనర్ తెలిపారు. వీటి వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులపై బ్యాన్ విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
అలాగే ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని సూచించింది. టపాసులపై ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు కూడా బ్యాన్ చేసిందని, కోలకత్తా లోనూ బ్యాన్ చేయకపోతే సుప్రీం కోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచిందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా క్రాకర్లు బ్యాన్ చేయాలన్న తెలిపింది. అలాగే, ఎవ్వరూ క్రాకర్లు అమ్మడం గానీ , కొనడం గాని చేయొద్దన్న హైకోర్టు సూచించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని, ప్రచార మాధ్యమాల ద్వారా టపాసులు కాల్చకుండా ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపింది.
దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి ఇదివరకే పలు రాష్ట్రాలు టపాసులపై నిషేధం విధిస్తున్న విషయ తెలిసిందే. దేశ రాజధానితో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్ బ్యాన్ చేశారు.