మందుబాబులను ఇంటికి చేర్చే బాధ్యత పబ్ లు, బార్లదే

Update: 2021-12-30 17:30 GMT
మద్యం మత్తులో కస్టమర్లు ఉంటే.. వారిని గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత పబ్ లు, బార్లదేనని.. డ్రైవర్లు, క్యాబ్ లు అందించడానికి అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.. పరిమితికి మించిన మద్యం సేవించకుండా వారిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.

తాగి వాహనాలు నడిపితే బాధ్యత పబ్ లదేనని హైకోర్టు స్పష్టం చేసింది. సౌండ్ పొల్యూషన్ 45 డెసిమిల్స్ మించరాదని.. మైనర్లను పబ్ లోనికి అనుమతించొద్దని ఆదేశించింది. జనవరి 4 వరకూ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకూ రెండువేల మంది పోలీసులతో నిఘా ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడారు. పబ్ లు, బార్లలో డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లేకపక్షంలో 185 ఎంవీ చట్టం కింద కేసు నమోదు చేయాలని హెచ్చరించారు. పరిమితికి మించిన మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరోసారి హెచ్చరించారు.

మొదటి సారి మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపితే రూ.10వేల జరిమానాతోపాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తారన్నారు. రెండోసారి పట్టుబడితే 15వేల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష..మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.  ఇక మైనర్లు వాహనం నడపకూడదని.. రూల్స్ ఉల్లంఘించిన వారిపై కేసునమోదు చేస్తామన్నారు.
Tags:    

Similar News