ఆర్టీసీ సమ్మె 25వ రోజుకి చేరింది. కానీ, నేటికీ ఈ సమ్మె పై ప్రభుత్వం వేచి చూసే ధోరణినే అవలంభిస్తుంది. బకాయిలకు సంబంధించి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా ఆర్టీసీకి ప్రభుత్వం రూ.1099 కోట్లు బకాయి ఉన్న మాట వాస్తవమేనని అడ్వకేట్ జనలర్ అంగీకరించారు. కానీ అందులో తమ వాటా 48 శాతమేనని స్పష్టంచేశారు. మిగిలిన 52 శాతం బకాయి ఏపీ ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం కలుగజేసుకొంది. ఆర్టీసీ ఆస్తులు ఇంతవరకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించింది.
హైకోర్టులో ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపిస్తుండగా.. ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ బకాయిల భారం సంస్థపై పడిందని ఉద్యోగులు చెప్తున్నారు. రూ.5 వేల కోట్ల అప్పుల్లో వెయ్యి కోట్లు తగ్గితే కాస్త భారం తగ్గుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సమ్మె కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. శుక్రవారం జరగబోయే విచారణకు ఆర్టీసీ ఫైనాన్స్ సెక్రటరీ, ఎండీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. బకాయిలపై ఎల్లుండిలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... కార్మికుల నాలుగు ప్రధాన డిమాండ్లు తీర్చేందుకు అవసరమైన రూ. 47 కోట్లు ఇస్తారో ..ఇవ్వరో సూటిగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి కొంత సమయం కావాలని కోరగా ..హుజూర్ నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ కురిపించిన వరాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ... ఒక్క నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం... రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా అని అడిగింది. అలాగే ఆర్టీసీ కార్మికుల్ని సమ్మె విరమించాలని ఆదేశించలేము అని హైకోర్టు తెలిపింది.