అది ప్రజల ఇష్టం ..ప్రభుత్వానికి చురకలు అంటించిన హైకోర్టు !

Update: 2020-05-20 14:00 GMT
ప్రైవేటు ల్యాబుల్లో మహమ్మారి వైరస్ టెస్టులు చేయించుకోవడం..చేపించుకోకపోవడం అనేది ప్రజల హక్కు అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం మహమ్మారి టెస్టుల కోసం, ప్రైవేటు ఆస్పత్రులకు.. ల్యాబ్‌లకు అవకాశం ఇవ్వలేదు. అలా చేస్తే.. దోపిడికి పాల్పడతాయని ఈటల రాజేందర్ గతంలో చెప్పారు. అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదన్నారు. అయితే టెస్టింగ్‌లపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం గాంధీ, నిమ్స్‌లో మాత్రమే వైరస్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రైవేటు ఆస్పత్రులపై నమ్మకం లేకపోతే, ఆరోగ్య శ్రీ సేవలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణలో మహమ్మారి టెస్టింగ్ సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు, ల్యాబ్ ‌లు ఐసీఎంఆర్ ‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఐసీఎంఆర్ సూచించిన నిర్దారించిన ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని.. హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణలో మహమ్మారి టెస్టులను చాలా పరిమితంగా చేస్తున్నారు. ఐసీఎంఆర్ నిర్ధారించిన ఆర్టీ పీసీఆర్ టెస్టులను మాత్రమే చేస్తున్నారు. దీని వల్ల చాలా కొద్ది మొత్తంలోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే, టెస్టులు చేస్తున్న వారిలో ఆరు శాతం మందికిపైగా పాజిటివ్ వస్తోంది. వైరస్ సోకినా బయటపడని వారి వల్ల మరింత మందికి వైరస్ సోకుతోందని.. త్వరంగా గుర్తించడానికి మరిన్ని టెస్టులు చేయాలని ర్యాపిడ్ టెస్టులు చేయాలన్న సలహాలు నిపుణుల కొంతమంది చెప్తున్నారు.
Tags:    

Similar News