తెలంగాణ హోంమంత్రి సేఫ్.. కరోనా నుంచి విముక్తి

Update: 2020-07-03 15:00 GMT
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి బయటపడ్డారు. ఆ మహమ్మారిని జయించారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. కొద్దిరోజులు హోం క్వారంటైన్ లో ఉన్న తర్వాత తిరిగి విధుల్లో చేరనున్నట్టు తెలిపారు.

ఆస్తమాతో బాధపడుతున్న మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే మొదట్లోనే ఆయనకు కరోనాను గుర్తించి చికిత్స తీసుకోవడంతో కేవలం వారం రోజుల్లోనే మహమూద్ అలీ నయం చేసుకోగలిగారు. కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవడంతో ఆయన ముందే జాగ్రత్తపడ్డారు.

ఇక సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 20మందికి కరోనా పాజిటివ్ రావడంతో అంతటా కలకలం రేగింది. వాళ్లని, వాళ్ల కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు.

హైదరాబాద్ లో తీవ్రంగా ఉన్న కరోనా వల్ల అందరికీ వైరస్ వ్యాపిస్తోంది. సీఎం కార్యాలయం వరకు కూడా చేరింది. అందుకే అందరూ హైదరాబాద్ వదిలి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఏపీ సరిహద్దుల్లో భారీగా వాహనాలు క్యూ కడుతున్నాయి.
Tags:    

Similar News