సంశయాలు తొలిగిపోయాయి. భిన్నవాదనలకు చెక్ చెబుతూ తెలంగాణ సర్కారు ఆగస్టు 15 వేడుకల్ని ఎక్కడ చేయాలన్న అంశంపై ఒక స్పష్టత ఇచ్చింది. గత ఏడాది మాదిరే గోల్కొండ కోటలో స్వాతంత్య్ర సంబరాలు చేయాలని నిర్ణయించారు.
గోల్కొండలో వేడకలు జరుపుతుంటే.. భారీతనం మిస్ అవుతుందన్న వాదన తెలంగాణ అధికారపక్షాల్లో వ్యక్తమైంది. దీంతో.. పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తే.. పోలీసుల కవాతు.. శకటాల ప్రదర్శన లేకుండా ఉంటుందన్న ఉద్దేశ్యంతో పరేడ్ గ్రౌండ్ వైపు మొగ్గు చూపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇలాంటి నిర్ణయం కారణంగా.. భావోద్వేగం మిస్ కావటంతో పాటు.. విపక్షాలు విమర్శలతో విరుచుకుపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
దీంతో.. పరేడ్ గ్రౌండ్స్ ఆలోచనకు స్వస్తి పలికిన తెలంగాణ సర్కారు.. వేడుకల్ని మరోసారి గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇక.. ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. జెండా వందనం చేస్తారని.. వేడుకల్లో కళారూపాలు ప్రదర్శించాలని నిర్ణయించారు.