టీఆర్ ఎస్‌ కు అక్క‌డ కూడా అంత క్రేజా!

Update: 2018-11-22 08:05 GMT
తెలంగాణ ఆవిర్భావానికి ముందు టీఆర్ ఎస్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌నపైనే ప్ర‌ధానంగా దృష్టిపెట్టింది. ఉద్య‌మ‌కారుల‌తో క‌లిసి న‌డిచింది. వారికి ద‌శ‌-దిశ చూపింది. చివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఏక‌మై పోరాడ‌టంతో ప్ర‌త్యే రాష్ట్ర క‌ల సాకార‌మైంది. అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కారు పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత పార్టీ బ‌లోపేతంపై గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ దృష్టి సారించారు. కాంగ్రెస్‌ - టీడీపీ స‌హా ప‌లు పార్టీల నుంచి వ‌చ్చిన‌ నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకున్నారు.

టీఆర్ ఎస్ విస్త‌ర‌ణ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కాలేదు. దేశ విదేశాల్లోనూ పార్టీ శాఖ‌లు ఆవిర్భ‌వించాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ కుమార్తె - ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి స‌మితి కీల‌క పాత్ర పోషించింది. తెలంగాణ సంస్కృతి - సంప్ర‌దాయాల‌ను ప్ర‌చారం చేసిన ఆ సంస్థ‌.. ప‌లు దేశాల్లో త‌మ శాఖ‌ల‌ను ఏర్పాటుచేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగ బ‌తుక‌మ్మ ప‌ర్వ‌దినాల్లో క‌విత బ్రిట‌న్‌ - అమెరికా వంటి దేశాల‌కు వెళ్లి అక్క‌డ బ‌తుక‌మ్మ ఆడుతూ సంద‌డి చేస్తుంటారు.

ఆస్ట్రేలియాలోనూ టీఆర్ ఎస్‌ కు మంచి క్రేజ్ ఉన్న‌ట్లు తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఆస్ట్రేలియా - భార‌త్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం గ‌బ్బాలో టీ-20 మ్యాచ్ జ‌రిగింది. కంగారూ గ‌డ్డ‌పై ఉంటున్న భార‌తీయులు చాలామంది ఈ మ్యాచ్‌ ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. వారిలో ప‌లువురు టీఆర్ ఎస్ ప్ల‌కార్డులు ప‌ట్టుకొని ఉండ‌టం క‌నిపించింది. ప్ల‌కార్డుల‌పై కేసీఆర్ అంటే.. కీప్ కార్ ర‌న్నింగ్ అని రాసి ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ కు ఓటు వెయ్యాల‌ని - ఆ పార్టీని గెలిపించాల‌నీ వాటిపై ఉంది. ప్ర‌స్తుతం ఆ ప్ల‌కార్డులు సామాజిక మాధ్య‌మాల్లో విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. దేశ విదేశాల్లో కేసీఆర్‌ - టీఆర్ ఎస్‌ కు ఉన్న ఆద‌ర‌ణ‌కు ఈ మ్యాచ్‌ లోని దృశ్యాలే తార్కాణ‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు.


Tags:    

Similar News