విమోచ‌న‌మా.. స‌మైక్య‌మా.. జైశంక‌ర్ సార్ మాట‌ల్లో.. యాదికి!

Update: 2022-09-17 11:30 GMT
రాజ‌కీయాల్లో నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నా.. ఒక‌రిని ఒక‌రు తిట్టుకున్నా.. అన్ని వ‌ర్గాలు.. అన్ని పార్టీల నాయ‌కులు.. ఐకాన్ చూసే స‌మున్న‌త వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి.. మ‌హామేధావి.. ప్రొఫెస‌ర్ జై శంక‌ర్ స‌ర్‌. ఆయ‌న గురించి.. అంద‌రూ పాజిటివ్‌గానేఆలోచ‌న చేస్తారు. ఆయ‌నను అంద‌రూ ఆరాధ‌నీయుడిగానే చూస్తారు. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ‌లో నెల‌కొన్న సందిగ్ధానికి ఆయ‌న తెర‌దించుతూ.. గ‌తంలో చేసిన ప్ర‌సంగం.. ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ప్ర‌స్తుతం సెప్టెంబ‌రు 17ను..(అంటే.. నిజాముల నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన రోజు. నిజాం పాల‌న ప్రాంతాల‌ను భార‌త యూనియ‌న్‌లో కలుపుతూ.. నిర్ణ‌యం తీసుకున్న రోజు..) బీజేపీ విమోచ‌న దినంగా నిర్వ‌హిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా దీనిని నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే.. అదేస మ‌యంలో రాష్ట్రంలోని కేసీఆర్ ప్ర‌భుత్వం జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల పేరిట ఘ‌నంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. అయితే.. ఇక్క‌డ సందేహం ఏంటంటే.. అస‌లువిమోచ‌నమా.. స‌మైక్య‌తా..? అనేదే!

దీనికి తెర‌దించుతూ.. గ‌తంలోనే.. ప్రొఫెస‌ర్ జైశంక‌ర్ సార్‌.. ఒక సంక్షిప్త ప్ర‌సంగం చేశారు. ఇప్పుడుఏ సందేహాలు.. అయితే.. తెర‌మీదికి వ‌చ్చాయో.. అవే సందేహాలు గ‌తం నుంచి ఉన్న‌ట్టు ఆయ‌న ప్ర‌సంగంతో అర్ధ‌మ‌వుతోంది. ``విమోచ‌న దినోత్స‌వం అంటున్నారు. కానీ, ఇది సరికాదు!`` అని ఆయ‌న ప్ర‌సంగంలో స్ప‌ష్టం చేశారు. దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌లు కొన్ని ద‌శాబ్దాల పాటు.. నిజాం పాల‌న‌తో విసిగిపోయిన నేప‌థ్యంలోనే సాయుధ రైతాంగ పోరాటం.. వ‌చ్చి.. నిజాంకు వ్య‌తిరేకంగా.. క‌దం తొక్కి ఉంటే.. అది అక్క‌డికే ప‌రిమితం అయ్యేద‌ని అన్నారు.

అంతేకాదు.. నిజంగానే ప్ర‌జ‌లు నిజాం ఒక్క‌డికే.. వ్య‌తిరేకంగా.. ఉద్య‌మాలు నిర్మించి ఉంటే.. సెప్టెంబ‌రు 17తోనే.. ఆ ఉద్య‌మాలు ఆగిపోయేవ‌న్నారు. కానీ, ఆ తర్వాత‌.. కూడా మూడేళ్ల‌పాటు.. ఉద్య‌మాలు సాగాయ ని.. కాబ‌ట్టి.. నిజంగానే ప్ర‌జ‌లు ఒక్క నిజాంపైనే ఉద్య‌మించ‌లేద‌ని.. అప్ప‌టి భూస్వామ్య వ్య‌వ‌స్థ‌(ఫ్యూడ‌లిజం) పైనా.. నిజాం పోయినా.. నిజాంల‌కే గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని క‌ట్టబెట్ట‌డం వంటి.. కేంద్రం చేసిన సంకుచిత వైఖ‌రిపైనా.. ప్ర‌జ‌లు ఉద్య‌మించారని చెప్పుకొచ్చారు. కాబ‌ట్టి.. దీనిని విమోచ‌న దినం అనే అవ‌స‌రం లేద‌ని జైశంక‌ర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News