తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నా సమ్మె 24 రోజులకి చేరింది. కానీ - సమ్మె ముగిసే దారి మాత్రం కనిపించడంలేదు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు - అటు ప్రభుత్వం బెట్టు విడవకపోవడంతో సమ్మెకి ముగింపు దొరకడంలేదు. ఈ సమ్మె పై హైకోర్టు లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ , పరిష్కారం మాత్రం రావడంలేదు. ఈ సమ్మె వలన ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలు - ఉద్యోగస్తులు అగచాట్లు పడుతున్నారు. సరైన సమయానికి బస్సులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఇదిలా ఉండగా..సరైన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి షాక్ ఇచ్చారు. టీఎంయూ జెండాలో ఇప్పటివరకు ఉన్న గులాబీ రంగును తొలగించి...నూతన రంగులతో జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి సారథ్యంలోని నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జెండా రంగు మార్చుతూ... ఇప్పటి వరకూ గులాబీ కలర్తో ఉన్న యూనియన్ జెండాలో ఆ రంగును తొలగించారు. గులాబీ రంగు స్థానంలో బ్లూ - వైట్ కలర్లలో జెండాను తయారుచేసారు. టీఎంయూ ఆవిర్భావ కార్యక్రమంలో నాయకులు కొత్త రంగుల్లో తీర్చిదిద్దిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. దీనితో కేసీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది.
ఇకపోతే ఈ సమ్మె పై ప్రస్తుతం హై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కార్మిక సంఘాల నేతలలో చర్చలు జరిగినప్పటికీ అవి విఫలం అయ్యాయి. దీనితో కార్మిక సంఘాల తీరును తప్పుపట్టిన ముఖ్యమంత్రి.. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పారు. యూనియన్ తరపు న్యాయావాది దేశాయి ప్రకాశ్ రెడ్డి - ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. విలీనం డిమాండ్ పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చించాలి అని కోర్టు చెప్తున్నట్టు సమాచారం.