కోడిపందేల్లో 10 కోట్లు ఓడిపోయిన మంత్రి!?

Update: 2018-01-18 04:25 GMT
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ లోని ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడిపందేల్లో వారూవీరూ అని లేకుండా అంతా పాల్గొంటుంటారు. కొందరు ఓపెన్‌ గా పాల్గొంటే - మరికొందరు రహస్యంగా పందేలు ఆడుతారు. ముఖ్యంగా ఏపీలోని ప్రజాప్రతినిధుల్లో చాలామంది ఈసారి కోడిపందేల్లో భారీగా డబ్బులు పెట్టారట. వీరందరి సంగతి ఎలా ఉన్నా ఏపీలో జరిగిన ఈ కోడిపందేల్లో తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఏకంగా రూ.10 కోట్లు పోగొట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
    
తెలంగాణ ఏర్పాటుకు ముందు టీడీపీలో ఉన్న ఈ మంత్రికి తూర్పుగోదావరి జిల్లాలో బంధుత్వాలున్నాయి.  ఏటా ఆయన కోడిపందేల కోసం ముందుగానే ఏపీకి చేరుకుంటారట. ఎప్పటిలాగే ఈసారి  కూడా ముందే బరిలోకి దిగిన ఆయన తన అనుచరుల ద్వారా రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టి పందేలు కాయగా అందులో రూ.10 కోట్లు ఓడిపోయారని సమాచారం.
    
కాగా, ఈ సంగతి తెలిసిన సహచర తెలంగాణ మంత్రులు కొందరు ఆయన్ను పరామర్శించగా కోడిపందేలన్నాక గెలుపుఓటములు సహజమేనని.. గతంలో ఎన్నోసార్లు ఈ పందేల్లో కోట్లు గెలిచానని - అప్పుడప్పుడూ ఇలా ఓడిపోవడం సహజమేనని అంటున్నారట. ఆ మంత్రి 10 కోట్లు పోగొట్టుకోవడాన్ని అంత లైట్‌ గా తీసుకోవడంతో ఆయనకు పది కోట్లు ఒక లెక్కా అంటూ మిగతా నేతలు సెటైర్లు వేస్తున్నారట.
Tags:    

Similar News