రాత్రికే రాత్రే ఎవరూ కోటీశ్వరులు అయిపోరు. దాని వెనుక ఎంతో కష్టం, నష్టం, సుఖాలు దుఖాలు ఇమిడి ఉంటాయి. ఒక మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాడంటే ఆ ఎదుగుదలలోని అతడి చేదు ఘట్టాలను కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు రాష్ట్రమంత్రిగా.. ఇండియాలోనే టాప్ 10 కాలేజీల అధిపతిగా ఎదిగిన మన మల్లారెడ్డి ఈ స్థాయికి ఎదగడం వెనుక అంతులేని కష్టం దాగి ఉంది. తాజాగా కార్మిక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి తాను ఓ కార్మికుడినేనన్న విషయాలను పంచుకున్నారు. ఆయన చరిత్ర తవ్వి చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు.
ఎంత ఎదిగినా ఇప్పటికీ మంత్రి మల్లారెడ్డి సాదాసీదాగానే ఉంటారు. అతి సామాన్యుడిలా వ్యవహరిస్తారు. ఆ సామాన్యత వెనుక మల్లారెడ్డి అంతులేని కష్టం దాగి ఉందని ఆయన గతాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణకార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన జీవితం తొలినాళ్లలో పాలు, పూలు అమ్మాడన్న సంగతి తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అంత కష్టం పడి ఈ స్తాయికి ఎదిగిన మంత్రివర్యులి చరిత్ర చూసి అందరూ అభనందిస్తున్నారు.
40 ఏళ్ల క్రితం మల్లారెడ్డి ఓ సాధారణ పాలు, పూలు అమ్మేవ్యక్తి అట.. ఈ విషయాన్ని కార్మిక దినోత్సవ ప్రసంగంలో ఆయనే స్వయంగా తెలిపారు. ‘నేను 40 ఏళ్ల క్రితం పూలు, పాలు అమ్మాను. ఇప్పుడు నా కళాశాలలు దేశంలోనే టాప్ 10లో ఉన్నాయి. నా కష్టార్జితంతోనే ఇన్ని కళాశాలలు, సంస్థలు స్థాపించాను. మనం ఎంత కస్టపడితే అంత గొప్ప వాళ్లమవుతాం. సండే, మండే లేకుండా కష్టపడుతున్నా కాబట్టే ఈ స్థానంలో నేనున్నా’ అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చాడు.
మల్లారెడ్డి ఎదుగుదలలో ఎన్ని కష్టాలున్నాయో.. ఆయనపై అన్నే ఆరోపణలున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ శివారు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని.. వాటిలో కాలేజీలు కట్టారని ఆరోపించారు. కోర్టుకు కూడా వెళ్లాడు.అయితే ఎన్ని ఆరోపణలున్నా కానీ.. ఒక పూలు, పాలు అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్రమంత్రిగా.. టాప్ 10 కాలేజీల అధిపతిగా ఎదిగారంటే నిజంగానే ఎంతో కష్టం దాగి ఉందనే చెప్పాలి.
అందుకే ఇప్పటికీ ఇంత ఎదిగినా కూడా మల్లారెడ్డిలో ఓ పల్లెటూరి మల్లన్నే కనిపిస్తాడు. ఆయన భాష, వేషధారణ, నడవడిక ఫక్తు కింది స్థాయి వ్యక్తిలానే ఉంటుంది. ఎంత ఎదిగినా కూడా మల్లారెడ్డిలో ఆ ఫ్లేవర్ మిస్ కాలేదనడంలో ఎలాంటి సందేహం లేదు.