దాదాపుగా నెల రోజుల నుంచి నడుస్తున్న వరంగల్ ఉప ఎన్నిక హడావుడి మంగళవారం.. ఫలితాలు వెల్లడి కావటంతో ముగిసింది. ఎన్నికల సందడి ముగిసి.. పాలన మీద ఫోకస్ చేసే టైం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమైంది కూడా. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన రోజునే తెలంగాణలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ తక్షణం అమలు కానుంది. మొత్తం 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లే. దీంతో.. ప్రభుత్వానికి సంబంధించి తాయిలాలు.. కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం లేనట్లే.
స్థానిక సంస్థలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మరో నెల పాటు సాగనుంది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్సీలు ఎంపిక కానున్నారు. వాస్తవానికి 8 ఎమ్మెల్సీ స్థానాలకు మేతోనే గడువు ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన నాలుగు జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో.. తాజా ఎన్నికలు మొత్తం 12 స్థానాలకు జరగనున్నాయి.
ఇక.. ఎన్నికలు జరిగే జిల్లాల విషయానికి వస్తే.. అదిలాబాద్.. నిజామాబాద్.. వరంగల్.. మెదక్.. నల్గొండ.. ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి.. కరీంనగర్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ చూస్తే..
డిసెంబరు 2 ; నోటిఫికేషన్ జారీ
డిసెంబరు 9 ; నామినేషన్ల దాఖలకు గడువు
డిసెంబరు 10 ; నామినేషన్ల పరిశీలన
డిసెంబరు 12 ; నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబరు 27 ; పోలింగ్
డిసెంబరు 30 ; ఓట్ల లెక్కింపు