మాటకు.. రాత కు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. వాటిని ఆయుధాలుగా చేసుకొని డిజిటల్ ప్రపంచంలో చెలరేగిపోతున్నవారేకాదు.. రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అవుతున్నోళ్లు బోల్డంత మంది మన చుట్టూనే కనిపిస్తున్నారు. అలాంటిది ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలో బాగా తెలిసిన ఎంపీ రేవంత్ రెడ్డి లాంటోళ్లు టైమ్లీ గా ఎలా రియాక్ట్ అయ్యారో చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే.
ఎందుకంటే.. ఆ రియాక్షన్ వెనుక.. మాజీ బాస్ కు అంతో ఇంతో సాయం చేయాలన్న తలంపు ఉందన్నది మర్చిపోకూడదు. ఇంతకీ రేవంత్ చేసిన వ్యాఖ్య ఏంది? అది ఆంధ్రోళ్లకు ఎక్కడో ఎందుకు టచ్ అవుతుందన్న విషయంలోకి వెళితే.. ఆదివారం సాయంత్రం వేళ ఉన్నట్లుండి అర్జెంటు గా ప్రెస్ మీట్ పెట్టేశారు ఎంపీ రేవంత్. జూబ్లీహిల్స్ లోని తన నివాసం లో కొద్ది మంది మీడియా సభ్యుల్ని పిలిపించుకున్న ఆయన.. హడావుడి గా సందేశాన్ని ఇచ్చేశారు.
ప్రెస్ మీట్ పెట్టటం లో హడావుడి ప్రదర్శించినా.. మీడియా ప్రతినిధులు వచ్చిన తర్వాత మాత్రం దగ్గర దగ్గర ముప్పావు గంట పాటు మాట్లాడేశారు. తన మాజీ బాస్ మాదిరి.. మైకు కనిపిస్తే చాలు ఎంతకూ వదిలి పెట్టని తీరును ఆయన ఇంకా తగ్గించుకో లేదన్నట్లుగా రేవంత్ ప్రెస్ మీట్ ఉందని చెప్పాలి.
ఏపీ రాజధాని అమరావతి గందర గోళంగా మారిందన్న మాటను చెబుతూ.. తెలంగాణ వాదిగా ఈ పరిణామం తనకు ఆనందాన్ని కలిగిస్తుందంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదిగా సంతోషంగా ఉందంటూనే భారతీయుడిగా మాత్రం బాధ వేస్తుందంటూ తాను పెట్టిన వాత మాటకు వెన్న పూసే మరో మాటను చెప్పేశారు. ఏపీ రాజధాని గందరగోళంలో పడటంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ తెలంగాణకు ఆదాయం పెరుగుతోందన్నారు. అందుకే తెలంగాణ వాదిగా తనకు సంతోషంగా ఉందంటూ ఆంధ్రోళ్లకు ఒళ్లు మండేలా మాట్లాడారు రేవంత్.
అయితే.. రేవంత్ మాటల వెనుక పరామార్థం వేరే ఉందంటున్నారు. అదేమంటే.. తన ఎక్స్ బాస్ కు మేలు కలిగేలా.. మైలేజీ సొంతం చేసుకునేందుకు వీలుగా జగన్ ను తనదైన శైలిలో చురకలు వేశారన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ వాదిగా సంతోషంగా ఉన్నా.. నిన్నటి వరకూ సోదరుల్లా ఉన్న వారంతా కొట్లాడుకుంటుంటే భారత పౌరుడి గా మాత్రం బాధ కలుగుతుందని తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శించారు రేవంత్.
ఎన్నికల్లో సాయం చేసిన వ్యాపారికి మేలు కలిగించటం కోసం ఇలాంటి పరిస్థితి తెచ్చారంటూ తన మాటల్ని నెమ్మదిగా తన ఎక్స్ బాస్ కు మేలు చేసేలా రేవంత్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. మళ్లీ తెలంగాణ రాజకీయాలకు వచ్చేసిన రేవంత్.. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో తండ్రీకొడుకులు విఫలమయ్యారంటూ కేసీఆర్.. కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్లకు తన మాటలతో చురుకు పుట్టేలా చేసి.. అంతిమంగా తన మాజీ బాస్ కు రాజకీయ ప్రయోజనం కలిగించేలా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గురుప్రేమకు హాత్రం హేట్సాప్ చెప్పాల్సిందేనంటున్నారు.