రాజకీయం ఎంత సిత్రంగా.. మరెంత కఠినంగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా మునుగోడు ఉప ఎన్నికను చెప్పాలి. దీని దెబ్బకు ఇప్పటి రాజకీయ ఎత్తుగడలు ఇట్టే అర్థమయ్యేలా ఉండటమే కాదు.. అప్పుడప్పుడు మాత్రం ఆవిష్క్రతమయ్యే అరుదైన ఉదంతాలకు ఈ ఉప ఎన్నిక కేరాఫ్ అడ్రస్ లా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
తాజాగా.. చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఒక ఆసక్తికర వ్యాఖ్య వినిపిస్తోంది. ఎవరింట్లో పెళ్లికి ఎవరు హడావుడి చేస్తున్నారన్నట్లు.. మునుగోడు సీటు కాంగ్రెస్ పార్టీది.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలోకి చేరితే.. ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా మారటమే అసలుసిసలు రాజకీయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉంది కానీ.. వాస్తవానికి అయితే ఉప ఎన్నికకు కారణమైన పార్టీ.. నష్టపోయిన పార్టీకి మధ్యన ఫైట్ ఉండాలి.
అందుకు భిన్నంగా సిత్రమైన సీన్ ఇప్పుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తన పార్టీకి.. పదవికి రాజీనామా చేసేందుకుడిసైడ్ అయిపోవటంతో.. బీజేపీలో చేరటం.. కాషాయ కండువా వేసుకోవటం లాంఛనంగా మారిందే తప్పించి.. మరింకేమీ లేదన్న మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారటం తెలిసిందే. ఇలాంటివేళలో.. రాజగోపాల్ పార్టీలో చేరిన బీజేపీకి.. పార్టీ నుంచి వెళ్లిపోయిన కోమటిరెడ్డి బ్రదర్ కారణంగా కాంగ్రెస్ కు ఫైట్ ఉండాలి.
కానీ.. ఈ సీటును తాము దక్కించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తమ బలం చెక్కు చెదర్లేదని.. రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతను ఓడించిన సత్తా తమ సొంతమని చాటిచెప్పటంతో పాటు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రదర్శిస్తున్న బలం బలుపు కాదని.. వాపుగా ప్రచారం చేయటానికి మునుగోడు అరుదైన అవకాశం అన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూసినప్పుడు రోటీన్ కు భిన్నమైన సీన్లు కనిపిస్తాయి. అందుకే మునుగోడు ఉప ఎన్నిక.. అసలుసిసలు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా అన్న మాట పలువురి వినిపిస్తోంది.