ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి పై ఇటీవల కాలంలో అనేక విమర్శలు వస్తున్నా యి. ప్రజలు కడుతున్న పన్నులతో లక్షల్లో వేతనాలు పొందుతున్న ఆయన సలహాలు ఇవ్వడం మానేసి.. దీనికి విరుద్ధంగా రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ.. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ విమర్శలను ప్రభుత్వం ఖాతరు చేయకపోగా.. ఆయనకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్టీడీ)గా తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ దశరథ రామిరెడ్డిని నియమించారు.
దశరథరామిరెడ్డి డిప్యుటేషన్ పై ఏపీలో విధులు నిర్వహించబోతున్నారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు నెలకొన్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం(తెలంగాణ అధికారికి ఏపీలో అవకాశం) సంచలనం రేపుతోంది.
అయితే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎక్కువగా తెలంగాణకు చెందిన వారిని ఇక్కడ నియమిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. ఏపీ అంటేనే ఉప్పు నిప్పుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. జగన్ కోరగానే ఓఎస్‌డీగా దశరథరామిరెడ్డిని ఆంధ్రాకు పంపించేందుకు అంగీకరించడం.
తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న దశరథ రామిరెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్ల కాలానికి డిప్యుటేషన్ పై ఏపీకి పంపేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో దశరథరామిరెడ్డి డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి సజ్జల వద్ద పనిచేయాల్సి ఉంటుంది.
జల వివాదాలతో ఏపీకి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మాటలు లేవని.. అందరూ భావిస్తున్న తరుణంలో కీలక అధికారిని ఏపీకి పంపేందుకు కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడం, ఏపీలో సత్తా చాటే అధికారులు ఉన్నప్పటికీ.. వారందరినీ కాదని.. జగన్ ప్రభుత్వం తెలంగాణ అధికారిని రప్పించడం.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరి దీనిపై విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.