పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన హస్తిన పర్యటన కాంగ్రెస్ శ్రేణులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు - ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చలు జరుపనున్నారు. ప్రధానంగా టీడీపీతో పొత్తుల అంశంపై పార్టీ రథసారథి రాహుల్ గాంధీకి ఉత్తమ్ వివరించనున్నారని సమాచారం. దీంతోపాటుగా మొదటి విడతగా 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
పార్టీలో సమన్వయ లోపం - పార్టీలో పెండింగ్ లో ఉన్న పదవులపై నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా - ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ముందస్తు యాక్షన్ ప్లాన్ ను హై కమాండ్ సూచించనుంది. పీసీసీ ప్రచార కమిటీ - మేనిఫెస్టో కమిటీలను ఏఐసీసీ ప్రకటించనుంది. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజ నర్సింహ - ప్రచార కమటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం ప్రభాకర్ లను నియమించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఉత్తమ్ వ్యతిరేక శిబిరంగా పేరున్న కోమటి రెడ్డి సోదరులు - డీకే అరుణతో సహా పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.