తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో ఆయన నిర్ణయాలు ఆసక్తిని కలిగిస్తుంటాయి. మొక్కలు నాటడం - వాటిని పెంచడం అనే విషయంలో కేసీఆర్ ప్రారంభించిన హరితహారం ఆలోచన ఇలాగే ఎందరినో ఆకట్టుకుంది. నాటిన అన్ని మొక్కలు బ్రతికాయా అనే ప్రశ్న అటు ఉంచితే...ఎంతో కొంత ఫలితం వస్తుందనేది నిజం. అయితే, రాష్ట్రంలో పచ్చదనం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇలా కృషి చేస్తుంటే దీనికి భిన్నంగా...పచ్చనిచెట్లను నరికివేసే వారికి భారీగా జరిమానాలు వడ్డిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ - కూకట్ పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీపై తీవ్ర చర్యలు చేపట్టిన తీరు ఇందుకు నిదర్శనం.
కూకట్ పల్లిలోని ఇందూ ఫార్చూన్ ఫీల్డ్(గార్డెనియా) గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ అనుమతి లేకుండా 40చెట్లను నేలకూల్చింది. గుట్టుచప్పుడు కాకుండా పని చేసుకుపోతున్నామని సదరు సొసైటీ వాసులు అనుకున్నారు. అయితే, గేటెడ్ కమ్యూనిటీలో చెట్లను నరుకుతున్నారన్న సమాచారం అందుకున్న మేడ్చల్ డివిజన్ అటవీ అధికారు కాలనీకు చేరుకున్నారు. పరిస్థితులను పరిశీలించగా అనుమతి లేకుండా చెట్లను నరికి వేయడం రుజువైంది. దీంతో, కాలనీ వాసులపై వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్(వాల్టా)-2002 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. వారికి రూ. 53,900 జరిమానా విధించడంతోపాటు నష్ట పరిహారంగా 80 మొక్కలను వెంటనే నాటాలని ఆదేశించారు. మొక్కలు నాటే వారి పట్ల అటవీశాఖ కఠినంగా వ్యవహరిస్తుండటం - కూల్చిన చెట్లకు రెండింతలు మొక్కలు నాటాలని ఆదేశించడం పట్ల సహజంగానే సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మన కోసం, మన పర్యావరణం కోసం అధికారులు ఇలా కఠినంగానే వ్యవహరించాలని పలువురు పేర్కొంటున్నారు.