కారణం ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అయినా సరే వేరే రాష్ట్రానికి చెందిన వారు లక్షలాదిగా చిక్కుకుపోవటం తెలిసిందే. ఊరి కాని ఊర్లో ఉండిపోయిన ఎంతోమంది లాక్ డౌన్ వేళ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇంటికి వెళ్లే మార్గం లేక.. అవస్థలు పడుతూనే ఉండిపోయారు. లాక్ డౌన్ 3.0 స్టార్ట్ అవుతున్న వేళ.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉండిపోయిన వారికి వెసులుబాటు కల్పిస్తూ.. వారి ప్రాంతాలకు వారు వెళ్లిపోయేలా తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాన్ని ఖరారు చేసింది.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తమ సొంతూరు.. రాష్ట్రం వెళ్లాలనుకునే వారు https://tsp.koopid.ai/epass లింకు ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకుంటే.. వారికి పాస్ జారీ చేస్తారు.
ఒక కుటుంబానికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పాస్ పొందాలనుకునే వారు తమ పేరు.. మొయిల్ ఐడీ.. ఫోన్ నెంబరుతో పాటు.. తామున్న ప్రాంతం.. తాము వెళ్లాలనుకున్న ఊరి పేరు.. వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న వాహనానికి సంబంధించిన వివరాల్ని అందించాల్సి ఉంటుంది. అంతేకాదు.. తమ ఆరోగ్యం బాగానే ఉందన్న విషయాన్ని తెలియజేసేలా మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది.
ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాసులు జారీ చేస్తామని.. వాటితో ఎవరికి వారు వారి సొంతూరుకు వెళ్లిపోవచ్చని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఊరట కలిగించటం ఖాయమని చెప్పక తప్పదు.