ఏపీ అధికార వైసీపీ నేత, బడా నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇటీవల ఆయన హైదరాబాద్ లో ఇటీవల ఒకరిపై దౌర్జన్యం చేయడం.. కేసునమోదు కావడం.. విచారణకు రాకపోయేసరికి అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైనే తన కుక్కలు వదలడంపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పరార్ అయ్యారు. ఏపీలోని విజయవాడలో పీవీపీ ఉన్నట్టు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారని తెలిసింది.
బెదిరింపులు.. దాడులకు సంబంధించి పీవీపీకి నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే ఆయన విచారణకు హాజరు కావడం లేదు. సడన్ గా విజయవాడలో జరిగిన సీఎం జగన్ అంబులెన్స్ ప్రారంభోత్సవంలో కనిపించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు శనివారం విజయవాడలోని హోటళ్లు, పీవీపీ సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు.
ఈ నేపథ్యంలోనే అజ్ఞాతంలో ఉన్న పీవీపీ తాజాగా హాట్ ట్వీట్లు చేస్తున్నారు. ‘ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతీచోటా న్యాయానికి ముప్పు వాటిల్లినట్లే’ అంటూ నిర్వేదపు వ్యాఖ్యలు చేశారు. అయితే పీవీపీకి సపోర్టుగా ఏపీ వైసీపీ నేతలు కూడా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
ఇక తాజాగా తమిళనాడులో తండ్రీకొడుకులను లాకప్ డెత్ చేసిన పోలీసులపై.. పోలీస్ వ్యవస్థపై పీవీపీ నోరుపారేసుకున్నాడు. పబ్లిక్ సర్వెంట్స్ అయిన వీరు సర్వ్ చేయాలంటూ హితవు పలకడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే పీవీపీని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు విజయవాడలో విస్తృతంగా గాలిస్తున్నట్టు తెలిసింది.