రాజకీయంగా విబేదాలు ఉండొచ్చు. గడ్డి పరక వేస్తే భగ్గుమనేలా శత్రుత్వం ఉండొచ్చు. కానీ.. గతానికి భిన్నంగా ఎప్పుడూ లేని రీతిలో తమ రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపైకి దాడులు చేసే సరికొత్త కల్చర్ ఈ మధ్యన మొదలైంది. కేవలం రోజుల వ్యవధిలో ముగ్గురు ముఖ్య నేతల ఇళ్ల మీద దాడికి పాల్పడిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ దరిద్రపుగొట్టు కల్చర్ ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. వాటిని తేల్చుకోవాల్సిన దగ్గర తేల్చుకోవాలే కానీ.. ఇళ్ల మీదకు దాడికి పాల్పడటం అమానమీయమైన చర్య అన్నది మర్చిపోకూడదు. ఇలాంటి కల్చర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా.. ఈ దాడుల పరంపరకు తెర తీసిన క్రెడిట్ మాత్రం ఏపీ అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడు తమ అధినేత మీద ఘాటు విమర్శలు చేశారని.. దారుణంగా తిట్టారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తాడేపల్లిలోని చంద్రబాబు నివాసం పైకి దూసుకొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్.. ఆయన అనుచరులు నానా యాగీ చేశారు. కర్రలతో దూసుకొచ్చిన వారిని.. టీడీపీ నేతలు.. కార్యకర్తలు ఢీ అంటే ఢీ అన్న రీతిలో రియాక్టు కావటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదంతంలో పోలీసుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇంటి మీదకు టీఆర్ఎస్ యూత్ విభాగ నేతల ఆధ్వర్యంలో ముట్టడి పేరుతో దాడికి యత్నించినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గులాబీ దళాన్ని ఎదుర్కొని అడ్డుకోవటంలో కాంగ్రెస్ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించారు. ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించటం ద్వారా.. రేవంత్ కు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు మండిపడుతున్నారు.
ఇప్పటికే రేవంత్ స్థాయికి మించి మంత్రి కేటీఆర్ ఆయన మాటలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని.. దీంతో ఆయన బలాన్ని తాము పెంచి పోషిస్తున్నట్లుగా మారుతుందన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటి మీదకు హిందూ సేనకు చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటం వల్లనో.. మజ్లిస్ కార్యకర్తలు సిద్ధంగా లేకపోవటం వల్ల.. దాడి కార్యక్రమం విజయవంతమైంది. ఈ దాడిలో అసద్ నివాసం పాక్షికంగా ధ్వంసమైంది. ఢిల్లీలోని అశోకా రోడ్డులోని ఆయన ఇంటిపైకి దాడి జరిగింది.
దేశ రాజధానిలో ఒక ఎంపీ నివాసానికి సురక్షితంగా లేకపోతే ప్రధాని మోడీ.. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏం జవాబు ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాకుంటే.. అసద్ ఇంటి మీదనే కాదు.. గడిచిన నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చందిన నేతల ఇళ్లపై దాడులు జరగటం గమనార్హం. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. సదరు ఇంటి వద్ద రాజకీయ విన్యాసాల్ని ప్రదర్శించటం.. నిరసనల్ని చేపట్టే కల్చర్ మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.