తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఏ పార్టీలో ఉన్నా తనదైన బలంతో ముందుకెళ్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన తుమ్మలకు.. ఉమ్మడి రాష్ట్ర విభజనతో రాజకీయంగా సంక్లిష్టత ఎదురైంది. అటు పుట్టి పెరిగిన టీడీపీని వదలి వెళ్లలేక.. ఆ పార్టీలోనే ఉంటూ రాజకీయ భవిష్యత్ ను వదులుకోలేక.. ఇటు తన మిత్రడైన అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు రాలేక నలిగిపోయారు. ఇలాంటి సమయంలో కేసీఆరే స్వయంగా తుమ్మలను ఆహ్వానించి టీఆర్ఎస్ తొలి విడత సర్కారు లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. తర్వాత పాలేరు ఉప ఎన్నికలో టికెట్ ఇచ్చి గెలుపొందేలా చూశారు.
అయితే, 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీచేసిన తుమ్మల అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీనికి వర్గ రాజకీయాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతోపాటు మిగతా రాష్ట్రం అంతా స్వీప్ చేసినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కావడంతో అధిష్ఠానం జిల్లా నాయకత్వంపై సీరియస్ అయింది. వ్యక్తిగతంగా ఓటమి తర్వాత తుమ్మల ప్రభ మరోసారి మసకబారింది. ఆయనకు మూడున్నరేళ్లయినా ఇంతవరకు ప్రభుత్వంలో పదవి రాలేదు. మరోవైపు 2014-19 మధ్య ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 2019లో టిక్కెట్ కూడా రాలేదు. తుమ్మలకు ప్రత్యామ్నాయంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, పొంగులేటికి ప్రత్యామ్నాయంగా నామా నాగేశ్వరరావును ఎంచుకుని టీఆర్ఎస్ ముందుకెళ్లింది. ప్రస్తుతం అటు జిల్లా పార్టీలో, ఇటు ఢిల్లీలో వీరిద్దరికే ప్రాధాన్యం దక్కుతోంది.
తుమ్మల కింకర్తవ్యం..?
అందరూ సిద్ధంగా ఉండండి..ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అంటూ నేలకొండపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు బుధవారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే సమయంలో గతంలో చేసిన తప్పులు మళ్లీ జరుగకుండా చూసుకోవాలని నిర్దేశించారు. మంత్రిగా అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, కార్యకర్తలను పూర్తి స్థాయిలో కలవలేకపోయానని చెప్పారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని.. ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు. అయితే.. తుమ్మల మాటల వెనుక అంతరార్థం ఏమిటో తెలియడం లేదు. వాస్తవంలో చూస్తే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇటీవల ఖమ్మం జిల్లాకు వచ్చిన సమయంలో తుమ్మల గురించి సానుకూలంగానే మాట్లాడారు. ‘‘అవసరమైన చోట కొన్ని మార్పులు తప్పవు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. టికెట్లు రాని వారిని పార్టీ వదులుకోబోదు. విభేదాలు పక్కనబెట్టి నాయకులంతా జిల్లాలోని 10కి 10 స్థానాలు గెలిచేలా పని చేయాలి’’ అని సూచించారు. అయితే, తుమ్మల తాజా వ్యాఖ్యలను చూస్తే.. పాలేరు టీఆర్ఎస్ టికెట్ తుమ్మలకు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
సొంత బలం లేని బీజేపీ.. గాలిలో గాలాన్ని నమ్ముతోందా?
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, ఏడాది తర్వాత అయినా బీజేపీకి మూడో స్థానమే అన్నట్లుగా ట్రెండ్ కనిపిస్తోంది. అంచనాలు, విశ్లేషణలు ఈ విధంగానే వస్తున్నాయి. ఇక అటు చూస్తే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ హోరాహోరీ పోరాటం సాగేలా ఉంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు సహా ఎంత ప్రయత్నించినా.. ప్రధాని మోదీ సహా ఎందరు పర్యటనకు వచ్చినా బీజేపీ బలం పుంజుకోవడం చాలా సంక్లిష్టమే. దీంతోపాటు ఆ పార్టీకి అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేంతగా అభ్యర్థులే లేరు. దీంతో ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే పనిలో పడుతోంది. ఇటీవల ఆ పార్టీ చేరికల కమిటీ నాయకులు ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన చేరికల జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి, మాజీ ఎంపీల పేర్లున్నట్లు వార్తలు వచ్చాయి.
నేతల బలమే తప్ప.. పార్టీ బలమేది?
సైద్ధాంతిక పార్టీగా చెప్పుకొనే బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టాలనే తహతహలో ఉన్న బీజేపీ.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను చేర్చుకునే ప్రయత్నాలు భారీఎత్తున చేస్తోంది. ఆ పార్టీ విధానపరంగా చూస్తే ఇది కొంత వ్యతిరేకమే. కాగా, వీరిలో ఎందరు పూర్తిగా బీజేపీ భావజాలం ఉన్నవారు అనేది చూస్తే సమాధానం తక్కువమందేనని వస్తుంది. మరోవైపు ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వ్యక్తిగత కరిష్మాతో గెలిచినవారే. అదీ ఉప ఎన్నికల్లో విజయం సాధించినవారే. హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే కూడా దాదాపు వ్యక్తిగత కరిష్మాతో గెలిచారనే అనుకుకోవాలి.
మునుగోడులో మునుగుడేనా..? తేలుడా?
తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక ఖాయమైంది. అయితే, మునుగోడు దశాబ్దాలుగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ కాకుంటే అక్కడ సీపీఐకి బలముంది. టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీ యంత్రాంగం పరంగా బలంగా ఉన్నట్లే. ఇక బీజేపీకే ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తప్ప క్యాడర్ బలంగా పెద్దగా లేనట్లు. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడులో మునుగుతుందా? తేలుతుందా? అన్నది చూడాలి. సంస్థాగత పటిష్ఠాన్ని వదిలేసి.. కేవలం చేరికలను మాత్రమే చూసుకుంటూ మురిసిపోతే బీజేపీకి కష్టమే.
చేరికలపైనా స్పష్టత లేదా?
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న పార్టీలోనే తీవ్ర విభేదాలతో దెబ్బతీశారనే పేరున్న నేతలను బీజేపీ చేర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరూ జిల్లాలో పార్టీకి చేటు చేశారనే పేరుంది. ఉప్పునిప్పుగా ఉండే వీరు.. పార్టీ మారి.. అది కూడా ఒకే పార్టీలో చేరడం అంటే కొంత అసహజంగా ఉండనుంది. ఇక పార్టీ విధానాలతో సంబంధం లేకుండా చూసినా.. వీరికిది మూడో పార్టీ కానుంది. అన్నిటికిమించి ఒకచోట పార్టీలోనే సఖ్యతగా లేనివారు మరో పార్టీలో ఒకేసారి చేరి మనగలుగుతారా? అనేది చూడాలి. ఒకవేళ వీరద్దరినీ బీజేపీ చేర్చుకుంటే గనుక.. ఆ పార్టీకి చేరికలపై స్పష్టత లేనట్లే అవుతుంది.