కేసీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ రోజునే పోలింగ్‌?

Update: 2018-09-24 06:50 GMT
షెడ్యూల్ కంటే ముందు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన కేసీఆర్ కార‌ణంగా తెలంగాణ అసెంబ్లీకి ముందే ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి?   కీల‌క‌మైన పోలింగ్ ఎప్పుడు ఉంటుంది? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం న‌వంబ‌రు 24న కీల‌క‌మైన పోలింగ్ ఉంటుంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ‌లోని 119 స్థానాల‌కు ఒకే రోజు పోలింగ్ నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ముందే ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉన్నా.. ఓట‌ర్ల న‌మోదు.. ఓట‌ర్ల జాబితాలో చోటు చేసుకున్న మార్పులు చేర్పుల‌తో పాటు.. వ‌స్తున్న ఫిర్యాదుల కార‌ణంగా ఎన్నిక‌లు కాస్త ఆల‌స్యం అవుతున్నాయ‌ని చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ అక్టోబ‌రులో చివ‌ర్లో మొద‌లై.. ఎన్నిక‌ల పోలింగ్ న‌వంబ‌రు 24న జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్కీ నెంబ‌రు 6. ఒక‌వేళ ఇప్పుడు అందుతున్న స‌మాచారం నిజ‌మైన ప‌క్షంలో ఈసీ ఎన్నిక‌లు నిర్వ‌హించే పోలింగ్ డే కేసీఆర్ కు ల‌క్కీ నెంబ‌రు వ‌చ్చే డేట్ కావ‌టం గ‌మ‌నార్హం.

24ను క‌లిపితే.. అంతిమంగా 6 వ‌స్తుంది. ఇది కేసీఆర్ ల‌క్కీ నెంబ‌రుగా చెబుతారు. త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసేందుకు సైతం కేసీఆర్‌.. త‌న అదృష్ట సంఖ్య అయిన ఆరు వ‌చ్చేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. కేసీఆర్ ల‌క్కీ నెంబ‌రు రోజునే కీల‌క‌మైన పోలింగ్ జ‌ర‌గుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News