కోడిగుడ్లకు ఫుల్ డిమాండ్..తెలంగాణలో రోజుకు 2 కోట్లు తినేస్తున్నారట !

Update: 2020-09-04 14:30 GMT
కరోనా మహమ్మారి కట్టడికి కోడుగుడ్డు ఇప్పుడు కొండంత అండగా మారింది. కూరగాయలు కిలో రూ.70కి తక్కువలేదు..అదే నాన్ వెజ్ అయితే వందల రూపాయలే చెల్లించుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభిస్తుండటంతో చాలా మంది గట్టిగా తినేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని తెలుస్తుంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1.8 లక్షల గుడ్లు అమ్ముడు అవుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2 కోట్లకు చేరింది. దీంతో కోడిగుడ్ల వాడకంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కరోనా మహమ్మారిని నుండి రక్షణ పొందేందుకు గుడ్డు బాగా ఉపయోగపడుతుందని ఐసీఎమ్మార్ మార్గదర్శకాల్లో పేర్కొనడంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది.

ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లోనే గుడ్లు తినే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. అయితే ఇటీవల నగరాల నుంచి చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో అక్కడ వాడకం పెరగడానికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌ లో గతంలో రోజుకు 70 లక్షల గుడ్లు తింటే, ఇప్పుడు 60 లక్షలకు తగ్గిపోయింది. గత జూన్, జులై నెలలో వీటి వాడకం ఎక్కువగా ఉందని తెలిపారు.

కాగా గతంలో రాష్ట్రంలో రోజుకు 3.5 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి జరగగా.. 1.80 కోట్లు స్థానిక అవసరాలకు, 1.70 కోట్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. కానీ ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి 3 కోట్లకు పడిపోవడంతో రాష్ట్రంలోనే 2 కోట్ల వరకు అవసరం అవుతున్నాయి. దీంతో కోటి గుడ్లు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. మొత్తానికి కరోనా మహమ్మారి కారణంగా కోడి గుడ్లకు గిరాకీ బాగా పెరగడం విశేషం.
Tags:    

Similar News