క్యాలెండర్ ను కాస్త వెనక్కి తిప్పుదాం. హైదరాబాద్ లో తొలి పాజిటివ్ కేసు నమోదైన తర్వాత.. రెండో కేసు నమోదు కావటానికి మధ్య ఎన్ని రోజులు గడిచిందన్నది ఒక లెక్క అయితే.. తొలి పది కేసుల నమోదుకు ఎంత కాలం తీసుకున్నదో గుర్తు చేసుకుంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వణుకు తెప్పిస్తున్నాయి. ఒకప్పుడు పది కేసులు నమోదు అంటే వామ్మో అనుకునే స్థాయి నుంచి.. నెమ్మదిగా పెరుగుతూ రోజుకు పాతిక.. ఆ తర్వాత ముప్ఫై.. తర్వాత యాభై చొప్పున రోజువారీగా కేసులు రావటం తెలిసిందే.
గడిచిన వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు గుండెల్లో కొత్త దడను పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరే ప్రాంతంలో లేని రీతిలో హైదరాబాద్ మహానగరంలో కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు రోజువారీగా వందకు పైగా కేసులు నమోదు కావటంతో మహానగర వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆదివారం ఒక్కరోజులోనే తెలంగాణ వ్యాప్తంగా 154 కేసులు నమోదైతే.. అందులో 132 కేసులు హైదరాబాద్ లోనే కావటం గమనార్హం.
ఇటీవల కాలంలో రోజూ వంద కేసులకు పైనే నమోదువుతునన వైనం పెరుగుతోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. ఆదివారం పన్నెండు కేసులు నమోదు కాగా మేడ్చల్లో ముగ్గురు.. యాదాద్రిలో ఇద్దరు.. సిద్దిపేట.. మహబూబ్ నగర్.. సంగారెడ్డి.. నాగర్ కర్నూలు.. కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో మహమ్మారిమరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజులోనే తెలంగాణ లో 14 మంది మరణించారు.
పెరిగే కేసులకు తగ్గట్లే.. మరణాలు కూడా ఈ మధ్యన పెరగుతుండటం గమనార్హం. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో అంతకు మించి అన్నట్లు ఉంది. తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదవుతుంటే.. ఏపీలో మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు కావటం గమనార్హం. ఆదివారం ఒక్కరోజునే 199 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా పాజిటివ్ లలో 130 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. 69 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 3,650 కాగా.. ఏపీలో 4,659 కి చేరుకుంది.