ఇంతకూ సుడి అన్న మాటను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే.. పని చాలామంది చేయొచ్చు. ఫలితాన్ని పొందొచ్చు.కానీ.. చేసిన పనికి తగ్గ ఫలితం సరైన సమయంలో.. సరైన వ్యక్తుల నుంచి కానీ సంస్థల నుంచి కానీ రావటానికి మాత్రం సుడి తప్పనిసరి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో.
కేంద్రంతో కోట్లాడుతూ.. డెవలప్ మెంట్ విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా తెలంగాణ ఉందన్న విషయాన్నిపదే పదే చెబుతున్న వేళ.. ఆ మాటలకు తగ్గట్లే రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు రావటం మామూలు విషయం కాదు. అందునా తాను ఎవరినైతే టార్గెట్ చేశారో.. ఆ కేంద్రం పరిధిలో ఉండే సంస్థల నుంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటం సుడి ఉంటే మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.
తాజాగా నీతి అయోగ్ విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్సులో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండోస్థానం లభించింది. మొదటి స్థానంలో పొరుగున ఉన్న కర్ణాటక నిలిచింది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఇంతకూ ఈ ఇన్నోవేషన్ సూచీ ఏమిటన్న విషయాన్ని నీతి అయోగ్ ఏమని చెబుతుందంటే.. తెలంగాణ రాష్ట్రం బహుళ జాతి సంస్థలు.. స్టార్టప్ లకు నెలవుగా మారినట్లు పేర్కొంది. అన్ని కొలమానాల్లోరాష్ట్రం మంచి పనితీరు కనబర్చిందని.. ఐసీటీ ల్యాబ్స్ తో కూడిన పాఠశాలల్ని17 శాతం నుంచి 35 శాతానికి చేర్చిందని.. ఉన్నత విద్య ఎన్ రోల్ మెంట్స్ లో ప్రతి లక్ష జనాభాకు 9.7నుంచి 15.7కు పెరిగినట్లు పేర్కొంది.
వీటన్నింటితో పాటు పేటెంట్లు.. ట్రేడ్ మార్కులు.. ఇండస్ట్రియల్ డిజైన్ లాంటి అంశాల్లోనూ రాష్ట్రం తన సత్తాను చాటినట్లు పేర్కొంది. స్వల్ప వ్యవధిలో స్టార్టప్స్ 4900 నుంచి 9 వేలకు చేరినట్లుగా వెల్లడించింది. నీతి అయోగ్ లాంటి సంస్థ నుంచి ఇలాంటి ప్రశంస పొందటం అంత తేలికైన విషయం కాదు. ఇన్నోవేషన్ సూచీకి సంబంధించి గతంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండే తాజాగా రెండో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో పెర్ఫార్మర్ విభాగంలోనూ మొదటి స్థానంలో నిలిచింది.
ర్యాంకులకు తీసుకున్న కొలమానాల్లో ఎనేబుల్స్.. పెర్ఫార్మర్ పేరుతో గ్రూపులుగా విభజించారు. వాటిల్లో ఎనేబుల్స్ లో తెలంగాణ నాలుగో స్థానం నిలిస్తే.. ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. పెర్ఫార్మర్ విభాగంలో తెలంగాణ తొలిస్థానంలో నిలిస్తే.. ఏపీ ఏకంగా 14 స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఓవైపు కేంద్రంపై పోరాడుతున్న వేళ.. నీతి అయోగ్ నివేదికలో తెలంగాణ రాష్ట్ర పని తీరుపై సానుకూలంగా ఉండటం కేసీఆర్ అండ్ కోకు మరింత బలాన్ని అందిస్తుందని చెప్పక తప్పదు.