రాష్ట్రంలో మరో మానవ మృగం ..16 మంది ఆడవాళ్ళని ..

Update: 2019-12-28 11:20 GMT
17 మందిని చంపిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసుల కు చిక్కాడు. కల్లు, మద్యం తాగే మహిళలే అతడి టార్గెట్. వారికి మాయ మాటలు చెప్పి, మద్యం తాగించి, ఎవరు లేని ప్రదేశాలకు తీసుకెళ్లి చంపేస్తాడు. ఆ తరువాత వారి ఒంటి పై ఉన్న నగలను దోచుకెళ్తాడు. ఆ దోచిన నగలను అమ్మిపెట్టడం , నిందితుడి భార్య పని. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 16మంది మహిళలను హత్య చేశాడు ఆ సీరియల్ కిల్లర్. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఇటీవల ఓ మహిళ హత్యకు గురైంది. ఆ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకోని విచారించగా ..ఈ నిజం బయటపడటం తో పోలీసులే షాక్ అయ్యారు. దీనితో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను చేసిన ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నెల 17న నవాబు పేట మండలం కూచూరుకు చెందిన అలివేలమ్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెది హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు, జిల్లా లోని బాలానగర్ మండలం గుంపేడుకు చెందిన పాత నేరస్తుడు ఎరుకల శ్రీను పాత్ర ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి ని విచారించ గా, అతి వేలమ్మ ను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ నెల 16న శ్రీను మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్న ఓ కల్లు కాంపౌండ్ వద్దకు వెళ్లాడు. నవాబుపేట మండలం కూచూర్‌కి చెందిన అలివేలమ్మ తో అక్కడ మాటలు కలిపాడు. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుసుకున్నాడు. దేవర కద్రలో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చేది ఉందని, తనతో వస్తే రూ.4వేలు ఇస్తానని ఆశ పెట్టాడు. శ్రీను మాటలు నమ్మి అలివేలమ్మ అతని బైక్‌ పై బయలుదేరింది. అయితే మార్గమధ్యలో డోకూర్ సమీపం లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపిన శ్రీను.. ఆమెపై దాడి చేసి ,హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, కాలి పట్టీలు ఎత్తుకెళ్లాడు.

ఇకపోతే , 2007లో తన సొంత తమ్ముడిని హత్య చేసిన కేసులో శ్రీను జైలుకి వెళ్లాడు. అయితే పరివర్తన కింద అప్పీల్ చేసుకోవడంతో మూడేళ్లకే బయటకొచ్చాడు. ఆ తర్వాత కూడా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకొచ్చాక ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ హత్యలు చేశాడు. అలా 2018లో జైలు నుంచి బయటకొచ్చాక దేవరకద్ర,కొత్తకోట,మిడ్జిల్,భూత్పూర్ గ్రామాల పరిధిలో నలుగురు మహిళలను హత్య చేశాడు. శ్రీనుపై ఇప్పటివరకు 18 కేసులు నమోదు కాగా.. అందులో 17 హత్య కేసులుండటం విశేషం.

ఇదిలా ఉంటే తరచూ నేరాలకు పాల్పడి జైలుకు వస్తున్న ఇతడిలో మార్పును తెచ్చేందుకు జైళ్ల శాఖ తమ ఆధ్వర్యంలో నడుపుతోన్న ఓ పెట్రోల్‌ బంకులో ఉపాధి కల్పించింది. కానీ అక్కడ విధులకు సరిగా హాజరుకాకపోవడంతో వారు తొలగించారు. అయితే మళ్లీ ఉన్నాతాధికారులకు ఫోన్లు చేసి అక్కడే పని చేసేవాడు శ్రీను. తాజాగా అతడి హత్యలకు సంబంధించిన విషయం తెలిసి జైలు అధికారులు కూడా షాక్ అవుతున్నారు. దీనితో సీరియల్ కిల్లర్ శ్రీనుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. హంతకుడికి భార్య సాలమ్మ ఉందని, అతను చేసిన హత్యలకు ఆమె సహకారం అందించింది అని తెలిపారు. దీనితో సాలమ్మను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి ఒకటిన్నర తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.




Tags:    

Similar News