టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో సంచలనం నమోదైంది. ఎవ్వరూ ఊహించని వ్యక్తికి సిట్ నోటీసులు జారీ అయ్యాయి. అసలు ఈ కేసుకు సంబంధం లేని ఏపీ ఎంపీకి నోటీసులు జారీ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. వాళ్లతో ఈ ఎంపీకి ఏంటి సంబంధం అన్నది తెలుసుకొని అందరూ ఆరాతీస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. ఏపీలోనే అత్యంత వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణంరాజు.
ఏపీకి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఫాంహౌస్ కొనుగోళ్ల నిందితులను కలిశారనే ఆరోపణలతోనే విచారణకు రావాలని 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల నిందితులను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కలిశాడని ఆరోపణలు వచ్చాయి. వారితో మంతనాలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను విచారణకు పిలిచినట్టు సమాచారం. బీజేపీ ఏజెంట్లకు.. రఘురామకు ఏంటి సంబంధం అని అందరూ ఆరాతీస్తున్నారు.
అయితే వైసీపీతో తెగదెంపులు చేసుకున్న రఘురామ ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఈ నిందితులతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసులో రఘురామ పాత్ర ఏంటి? ఆయన ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ పోలీసులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ డాక్టర్ జగ్గు స్వామి, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్, బండి సంజయ్ బంధువు, కరీంనగర్ న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది.
అయితే శ్రీనివాస్ మినహా బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ హాజరుకాలేదు. దీంతో వీరి ముగ్గురికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు రఘురామకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.