తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఏపీకి చెందిన పోలీసులు కొందరు సర్వే చేస్తున్నట్లుగా వార్తలు రావటం.. దీనిపై కేసీఆర్ అండ్ కో విమర్శలు చేయటం తెలిసిందే. సర్వే పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు కూడా. కట్.. చేస్తే తాజాగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఒక బృందం ఎన్నికల సర్వేను నిర్వహిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
ప్రొద్దుటూరులోని ఒకటో వార్డులో ఒక బృందం సర్వే నిర్వహిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నేతలు వారి వద్దకు వెళ్లి.. ఎవరు పంపారంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందటంతో వారు హుటాహుటిన చేరుకున్నారు. సర్వే చేస్తున్న బృందం తెలంగాణకు చెందిన వారుగా వారి గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. అంతేకాదు.. వీరు సర్వే చేయటానికి అధికారుల వద్ద ముందస్తుగా అనుమతి తీసుకున్న పత్రాల్ని కూడా పోలీసులకు చూపించారు.
ఇంతకీ సర్వే బృందం ఎక్కడి వారు? వారేం చేస్తుంటారు? వారు ఏ సంస్థ తరఫున సర్వే చేస్తున్నారన్న విషయంపై ఆరా తీసిన అధికారులు.. సర్వే చేస్తున్న వారంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని.. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను చూస్తే.. జేఎన్ టీయూ వర్సిటీ హైదరాబాద్.. ఉస్మానియా వర్సిటీ.. చెందిన వారిగా గుర్తించారు. ఎవరైనా సర్వే చేసుకోవచ్చని.. సర్వే పేరుతో ప్రలోభాలకు గురి చేయకుంటే చాలన్న విషయాన్ని ప్రొద్దుటూరు పోలీసులు స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బృందం సర్వే చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.