ర‌మ‌ణ‌.. ఇప్పుడు కూడా అదే మాట చెబుతావా?

Update: 2017-11-16 05:42 GMT
ధీమా వ్య‌క్తం చేయ‌టంలో లాజిక్ ఉండాలి. ఏదో మాట్లాడ‌మంటే మాట్లాడినట్లుగా మాట్లాడితే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఆ విష‌యాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ గుర్తిస్తే మంచిది. కొద్దిరోజుల క్రితం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డితోపాటు ప‌లువురు నేత‌లు భారీ ఎత్తున కాంగ్రెస్ బాట ప‌ట్ట‌టం తెలిసిందే.

రేవంత్ వెళ్లిపోవ‌టానికి ముందు తెలంగాణ‌లో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిన ప‌రిస్థితి. రేవంత్ నిష్క్ర‌మ‌ణ‌తో పార్టీ ఆయువు మీద దెబ్బ ప‌డింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

రాచ‌పీనుగ ఒక్క‌టే పోద‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే తన‌తో పాటు రేవంత్ భారీగా నేత‌ల్ని తీసుకెళ్లార‌ని చెప్పాలి. పార్టీని వ‌దిలేసి రేవంత్ వెళ్లిపోయిన నేప‌థ్యంలో ఏపీ సీఎం క‌మ్ పార్టీ అధినేత చంద్ర‌బాబు.. తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌లు మాట్లాడిన బ‌డాయి మాట‌ల్ని చూసి ముక్కున వేలేసుకున్న‌వాళ్లు ఎంద‌రో.

నేత‌లు వెళ్లిపోయినా పార్టీ మాత్రం ఇంకా బ‌లంగా ఉంద‌న్న మాట‌ను చంద్ర‌బాబు చెబితే.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు ఖాయ‌మంటూ ర‌మ‌ణ న‌మ్మ‌కంగా చెప్పుకొచ్చారు. స‌రైన నాయ‌కులే లేని వేళ‌..  పార్టీ జెండా రెప‌రెప‌లాడనుందంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కామెడీగా మారాయి.పార్టీ అధికారంలోకి రావ‌టం త‌ర్వాత‌.. క‌నీస కేడ‌ర్ కూడా లేకుండా పోతుంద‌న్న విష‌యాన్ని ర‌మ‌ణ లాంటి నేత‌లు గుర్తిస్తే మంచిది. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన నేత‌ల్ని చూస్తే.. జిల్లా పార్టీ అధినేత‌లు ఉండ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా తెలంగాణ అధికార‌ప‌క్షంలో చేరిన చేరిక‌లు చూస్తే.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌.. వ‌రంగ‌ల్ జిల్లాల్లో టీడీపీ పూర్తిగా వాష్ అవుట్ అయిన‌ట్లేన‌ని చెప్పొచ్చు. ఇంత‌కాలం పార్టీని న‌మ్ముకున్న బ‌ల‌మైన నేత‌లు సైతం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. తాజా ప‌రిణామాలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగుర‌వేయ‌టం త‌ర్వాత సంగ‌తి పార్టీ ఖాళీ కాకుండా వెళిపోతున్న నేత‌ల్ని ఆప‌గ‌లిగితే అదే ప‌దివేలుగా చెప్పాలి. పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న అసంద‌ర్భ ప్రేలాప‌న‌కు కౌంట‌ర్ అన్న‌ట్లుగా తాజాగా టీఆర్ఎస్ లో చేరిన తెలుగు త‌మ్ముళ్ల తీరు చూసిన త‌ర్వాత అయినా ర‌మ‌ణ ఆచితూచి మాట్లాడితే మంచిద‌న్న అభిప్రాయం
Tags:    

Similar News