రేవంత్ జంపింగ్ః టీడీపీ నేత‌ల‌కు శీల‌ప‌రీక్ష‌

Update: 2017-10-21 11:56 GMT
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి సొంత పార్టీకి గుడ్ బై చెప్పే ప‌రిణామం మ‌లుపులు తిరుగుతోంది. రేవంత్ పార్టీ వీడ‌టం దాదాపు ఖరారు అయిన నేప‌థ్యంలో త‌ర్వాత జ‌రిగే ఎపిసోడ్‌ ల‌పై అంద‌రి దృష్టి ప‌డింది. ఈ నేపథ్యంలో ఫ‌లాన నాయ‌కుడు పార్టీ మారుతున్నారు...ఇంకో నేత సైకిల్ పార్టీకి టాటా చెప్ప‌నున్నారు అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాము రేవంత్ రెడ్డితో వెళుతున్నామ‌ని కొంద‌రు..అబ్బే అదేం లేదంటూ మ‌రికొంద‌రు నేత‌లు స‌ర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీని వీడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దాదాపు 20 మంది నేత‌ల పేర్లు కూడా బయటికివచ్చాయి. అందులో ప్ర‌ధానంగా మక్తల్ నియోజకవర్గం  మాజీ ఎమ్మెల్యే - పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కోట దయాకర్ రెడ్డి పేరు కూడా ఉంది. ఈ ప‌రిణామంపై ఆయన స్పందించారు. తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని - ఒకవేళ ఆ లిస్ట్ లో తన పేరు ఉంటే నేను బాద్యుడిని కాదు అని దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ``తాను, త‌న భార్య టీడీపీ అధినేత‌ చంద్రబాబును కలిసి నిర్ణయం తీసుకుంటామని వివ‌రించారు. చంద్రబాబు చెబితేనే తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని కూడా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రోవైపు తెలంగాణలో టీడీపీ సీనియర్ రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ సీనియర్ నేత రాజారామ్ యాదవ్ స్పందించారు. తమ నాయకుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు అయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అనుసరిస్తానని రాజారామ్ యాదవ్ స్పష్టం చేశారు. చొప్పదండి నియోజకవర్గం  ఇంచార్జి - టీటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం సైతం రియాక్ట‌య్యారు. తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు ,తనను పార్టీ మారమని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవమేనని.. అయితే తాను పార్టీ మారే ముందు చంద్రబాబుతో భేటీ అయ్యి ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.
Tags:    

Similar News