తెలంగాణ వచ్చాక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలంగాణకు ముందు.. తర్వాత.. 'వాహన' యోగం ప్రజలకు అత్యవసరంగా మారింది. కరోనా తర్వాత కూడా ప్రజలు ఈ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంటే ప్రజలు సొంత వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపించారు. దీంతో తెలంగాణలో ఏటేటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కోటి 20 లక్షల కుటుంబాలు ఉండగా.. వాహనాల సంఖ్య కోటి 53 లక్షలు దాటింది.
తెలంగాణ రవాణాశాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2వ తేదీ నాటికి 71.52 లక్షల వాహనాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 1.53 కోట్లు దాటగా.. ఇందులో ద్విచక్ర వాహనాలు 73.7 శాతం, కార్లు 13 శాతం ఉన్నాయి. వీటి తర్వాత స్థానం ట్రాక్టర్లదే.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాలు కలిపి రోజూ కొత్తగా పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఓవైపు వ్యక్తిగత వాహనాలు పెద్ద ఎత్తున పెరుగుతుండగా.. అదే సమయంలో ప్రజారవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు మాత్రం 10479 నుంచి 9164కి తగ్గాయి. ఈ లెక్కన 12.5 శాతం తగ్గాయి.
ఇక వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు భారీ ఆదాయం వస్తోంది. తొమ్మిదేళ్లలో 320 శాతం పెరిగింది. నిరుటితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి పైగా ఆదాయం పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే రికార్డు.
డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ ఆ ఇంధనాలతోనే నడిచే వాహనాల కొనుగోళ్ల దూకుడు తగ్గడం లేదు. కాలుష్యాన్ని అంతకుమించి ఇంధన ఖర్చులను భారీగా తగ్గించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తెలంగాణలో ఇంకా ఊపందుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ వాహనాల సంఖ్య కేవలం 60వేల లోపే ఉంది. ఇది మొత్తం వాహనాల్లో కేవలం 0.37శాతం మాత్రమే కావడం గమనార్హం.
తెలంగాణ ఆవిర్భవించిన 2014 తొలి ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ ఆర్జించిన ఆదాయం రూ. 2వేల కోట్లలోపే. 2022-23 నాటికి ఇది మూడింతలు దాటింది. ఈ ఏడాది ఆదాయం రూ.6వేల కోట్ల పైచిలుకే. 2020-21లో కోవిడ్ తో ఆదాయం తగ్గింది.
ఇక తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక సంపద సృష్టి పెరిగిందని దీన్ని బట్టి అర్థమవుతోంది. కుటుంబాల ఆదాయంలో భారీ వృద్ధి ఫలితంగానే వాహనాల సంఖ్య పెరుగుతోందని రవాణా శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.