దత్తపుత్రుడు! ఈ మాట రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అయితే.. తరచుగా ఇటీవ ల కాలంలో ఈ మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకువ చ్చేందుకు జనసేన అధినేత పవన్ ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబుకు.. పవన్ దత్తపుత్రుడిగా పనిచే స్తున్నార ని.. అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో కామంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. నేరుగా ముఖ్య మంత్రి జగనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన సభలోనూ జగన్ ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు.
దీంతో దూడ గట్టున మేయదు.. అన్నట్టుగా వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పవన్‌ను దత్తపుత్రుడిగానే పేర్కొంటున్నారు. దీంతో.. జనసేనాని పవన్ కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ``నన్ను మీరు సీబీఎన్ దత్తపుత్రుడు అంటే. నేను మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది`` అని హెచ్చరించారు. అయితే. పవన్ ఆ మాట అన్నాక కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ మళ్లీ దత్తపుత్రుడనే కామెంట్లే చేశారు. ఈ పరిణామాలతో ఈ దత్తపుత్రుడు.. అనే మాట.. రాజకీయాల్లో కీ వర్డ్‌గా మారిపోయింది.
ఇక, ఈ విషయంలో తెలంగాణ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా కొందరు దత్తపుత్రులు ఉన్నారంటూ.. రాజకీయ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌తో చేతులు కలిపిన చాలా మంది పాత కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుత ఎమ్మెల్యేలు.. కూడా.. టీఆర్ ఎస్‌తో టచ్‌లో ఉంటూ. కాంగ్రెస్ ను దెబ్బతీయాలని అంటున్నారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీతో చేతులు కలపాలని.. కూడా ఇండైరెక్ట్‌గా చెబుతున్నారని.. అంటున్నారు.
క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు మాత్రం ఒకసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇద్దాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనేది వీరి అభిప్రాయంగా వినిపిస్తోంది. కానీ, వీరి అభిప్రాయానికి భిన్నంగా.. కాంగ్రెస్ పాత నేతలు... మేధావులు మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ జూనియర్ అని.. ఆయనను అధికారంలోకి తీసుకురావడం ఇష్టం లేదని అంటున్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదనే వ్యూహంతో కాంగ్రెస్‌లో ఉన్న పెద్ద పెద్ద పదవులు అనుభవించిన కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట!
అంతేకాదు... వీరితోపాటు.. ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు టీఆర్ ఎస్‌తో, బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. నల్లగొండడ కాంగ్రెస్‌లో ఉన్న పెద్ద నాయకులు.. కాంగ్రెస్‌కు మేలు చేయాల్సింది పోయి.. టీఆర్ ఎస్, బీజేపీలకు లాభం చేసేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ అని.. ఇంక బతకడం కష్టమని.. డిసైడ్ అయ్యారట. అంతేకాదు.. కాంగ్రెస్ హైకమాండ్‌కే వీరు కొన్ని సూచనలు చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలుచేపట్టిన తర్వాత.. సీనియర్లు దూరమయ్యారు. ఆయనకు క్షేత్రస్థాయిలో యూత్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. సీనియర్లు మాత్రం ఆయనకు సహకరించడం లేదు. అంతేకాదు.. కాంగ్రెస్ చెట్టు కింద బతికిన నాయకులు.. ఇప్పుడు ఆ చెట్టుకే మంట పెడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు టీఆర్ ఎస్, బీజేపీకి అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. వీరిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నవారు.. వీరంతా దత్తపుత్రులుగా మారుతున్నారా? అని ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.