తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు రాష్ట్రంలో కూడా మరో 10 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో ఎమ్మెల్యేలే కాకుండా కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారు కూడా అప్రమత్తమై రాజకీయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల వ్యూహరచన బాధ్యతను వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించడంతో ఆయన ఇప్పటికే రంగంలోకి దిగి తన బృందాలతో మూడుసార్లు నియోజకవర్గాల్లో సర్వే చేయించి రిపోర్టులందించారని సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న టీంతో ఎన్నికల బరిలో దిగితే పార్టీ ఊహించని పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని, రాష్ట్ర మంత్రివ ర్గంలోని సగం మంది, ఎమ్మెల్యేల్లో 60 నుంచి 70 శాతం మంది ప్రజల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆయన నివేదిక సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో, ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని కలిగిస్తోంది. పీకే సర్వేపై జిల్లాల రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో రాష్ట్రంలోని పేరున్న సర్వే సంస్థలను సంప్రదించి తమ తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారని సమాచారం. పీకే నివేదికతోపాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం, ఇంటలిజెన్స్ యంత్రాంగం అందించిన నివేదికలు కూడా అధికార పార్టీకి అందుబాటులో ఉండడంతో ఏయే ప్రాంతంలో బలహీనంగా ఉన్నారో గుర్తించి నష్టనివారణ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రైవేట్‌గా ఎమ్మెల్యేలు సర్వే ఏజెన్సీలతోనే కాకుండా గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలకు చెందిన తమ సన్నిహితులను పంపించి సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది.
ఎమ్మెల్యేలే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నవారు కూడా ఏజెన్సీలతో సర్వేలు చేయించు కుంటున్నారని తెలిసింది. ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యేపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజల్లో ఎలా ఉంది, అవి ఓటును ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాయి, ఏ పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది అన్న విషయాలపై సర్వేను చేయించుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పేరున్న సర్వే ఏజెన్సీలు తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని సర్వే నిర్వహిస్తున్నాయని తెలిసింది. మొత్తానికి ఈ వ్యవహారంపై జిల్లాల్లో ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.