అవును. పౌరుల రక్షణ కోసం ఉద్దేశించిన పోలీసు ఉద్యోగాలు అమ్మకానికి ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఎస్సై వరకు ఈ పోస్టులు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి మరి. ఎక్కడ అంటున్నారా? పోలీసుల సంక్షేమంకోసం పాటుపడుతున్న తెలంగాణ రాష్ర్టంలో! అదేంటి సమాజంలో అన్నివర్గాల కంటే పోలీసుల సంక్షేమానికే టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే సదరు అధికారులు పోస్టులు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు మతలబు.
పోలీస్ పోస్టులను అమ్ముకోవాల్సిన అవసరం అధికారులకు ఏముంది చెప్పంది? ఒకవేళ ఇలా చేస్తే అదే పోలీసులు పట్టుకొని బొక్కలో వేయడం ఖాయం. దీన్ని గమనించిన జాదూగాళ్లు ఏకంగా కొత్త తరహా మోసానికి తెరతీశారు. సైబర్ నేరగాళ్ల అండతో ఏకంగా పోలీస్ కొలువులకు అప్లై చేసేందుకు కొత్త వెబ్ సైట్ ను రూపొందించారు. తెలంగాణలో కొలువుల భర్తీ సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో www.tslprb.in వెబ్ సైట్ ద్వారా పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితేద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసేలా ప్రత్యేక వెబ్ సైట్ ను జాదూగాళ్లు రూపొందించారు. www.tslprb.com
పోలీస్ రిక్రూట్ మెంట్ పేరుతో అగంతకులు నకిలీ వెబ్ సైట్ ఏర్పాటుచేసి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు అక్రమాలను అరికట్టేందుకు పత్రికా ప్రకటన విడుదల చేసి జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను సూచనలు ఇచ్చారు. సదరు మోసగాళ్లను పట్టుకునేందుకు టీంలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.