మరో రెండు రోజుల పాటు తెలంగాణ తడిచి ముద్దవబోతోంది

Update: 2021-09-07 04:03 GMT
గడిచిన కొద్ది రోజులుగా ఆకాశం ముసురేయటం.. ఉన్నట్లుండి ఒక్కసారి జడివాన కురవటం.. గంటల వ్యవధిలో సెంటీ మీటర్ల మీద సెంటీ మీటర్ల వర్షంతో తెలంగాణ మొత్తం వణుకుతోంది. తాజాగా మరో రెండు రోజుల పాటు అతి భారీ నుంచి భారీ వర్షాలు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. దీనికి కారణం తూర్పు.. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమేనని చెబుతున్నారు. రుతు పవనాల ద్రోణి వాయువ్య.. పశ్చిమ.. మధ్య బంగాళాఖాతంలోని ఒడిశా - ఉత్తరాంధ్ర తీరం మీదుగా కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రానున్న రెండు పాలు అతి భారీ.. భారీ వర్షాలు ఖాయమని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతుంటే.. మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షం ఖాయమని చెబుతున్నారు.

భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే జిల్లాలు

ఆదిలాబాద్
కుమ్రుంభీం ఆసిఫాబాద్
నిర్మల్
నిజామాబాద్‌

ఈ నాలుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఎత్తున వర్షాలు ఖాయమంటున్నారు. అవేమంటే..

మంచిర్యాల
జగిత్యాల
రాజన్న సిరిసిల్ల

ఇక.. మిగిలిన మరికొన్ని జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఉండవు కానీ.. కొన్ని ప్రాంతాలే వర్షం తాకిడికి గురవుతాయని చెప్పక తప్పదు.ఆ జిల్లాలు ఏవంటే..

కరీంనగర్
పెద్దపల్లి
సిద్దిపేట
యాదాద్రి భువనగిరి
రంగారెడ్డి
హైదరాబాద్
మేడ్చల్
వికారాబాద్
సంగారెడ్డి
మెదక్
కామారెడ్డి  

రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. వర్షాలు అధికంగా పడిన వేళల్లో కొత్త ప్రాంతాలకు వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వేళలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News